వామ్మో ఒక టిక్ టాక్ పోస్టుకు 6 కోట్ల సంపాదన.. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మతి పోవాల్సిందే?

ప్రస్తుత ప్రపంచంలో టిక్ టాక్ బాగా పాపులర్ అయ్యింది. ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా ప్రమోషన్ గురించి పోస్ట్ పెడితే దానికి తగ్గ పారితోషకం తీసుకోవడం మనకు తెలిసిందే. అయితే మార్కెట్లో వాళ్ళ వ్యాల్యూను బట్టి పారితోషకం ఫిక్స్ అవుతుంది. మహా అయితే లక్షల్లో పారితోషకం ఉండవచ్చు. మరి టిక్ టాక్ స్టార్ అయితే పెద్దగా పారితోషకం ఉండదు అనేది అందరి అభిప్రాయం.

దీనికి విరుద్ధంగా ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న టిక్ టాకర్ కాబిలేమ్ మాత్రం ఎంత తీసుకుంటాడో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. ఇతని పారితోషకం కోట్లల్లో ఉంటుందట. తాజాగా తాను ఒక పోస్టుకు ఎంత పారితోషకం తీసుకుంటాడో అతనే స్వయంగా వెల్లడించాడు. ఒక్క పోస్టుకు గాను ఏడు లక్షల 50వేల డాలర్లు తీసుకుంటానని వెల్లడించాడు.

ఇదే మన కరెన్సీలో అయితే అక్షరాల ఆరు కోట్ల రూపాయలకు పై మాటే. అయితే అతని మేనేజర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కాబీలేమ్ టిక్ టాక్ పోస్టుల ద్వారా ఏడాదికి పది మిలియన్ డాలర్లు సంపాదించడానికి దగ్గర్లో ఉన్నాడని తెలిపాడు. కాబీలేమ్ టిక్ టాక్ లోకి రాకముందు ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడు 2020లో కరోనా ద్వారా ఆ ఉద్యోగం వదిలేయాల్సి వచ్చింది.

ఇక టిక్ టాక్ లోకి అడుగుపెట్టి స్టార్ గా ఎదిగాడు. ప్రపంచంలోనే టిక్ టాక్ లో ఎవరు తీసుకొని పారితోషకం ఈయన తీసుకోవడంతో ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం తెలిసిన చాలామంది ఆశ్చర్యపోయి వారికి తోచిన విధంగా కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. కొందరైతే సినిమా స్టార్లనే మించిపోయాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP-Janasena: ఫ్లెక్సీలు చూసినా వైసీపీకి వణుకేనా.. టీడీపీ, జనసేన ఫ్లెక్సీలు కనిపిస్తే ఇంత భయమా?

TDP-Janasena:  వైసిపి నేతలలోనూ కార్యకర్తలలోనూ ఓటమి భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికలలో జనసేన టిడిపి కూటమిగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నటువంటి తరుణంలో విజయం వారిదేనన్న ధీమాతో జనసేన టిడిపి నాయకులు ఉన్నారు కానీ...
- Advertisement -
- Advertisement -