Manoj-Mounika: మంచు మనోజ్, భూమా మౌనిక ల ప్రేమ ఎక్కడ మొదలైందో తెలుసా?

టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు మనోజ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దొంగ దొంగది సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత బిందాస్ సినిమాలో నటించి ఆ సినిమాకు గాను నంది అవార్డు తన సొంతం చేసుకున్నాడు. తర్వాత మనోజ్ పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు అంతగా సక్సెస్ ను అందుకోలేకపోయాయి.

ఇక మనోజ్ నటన పరంగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే మనోజ్ గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా సాగుతుంది. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు సాగుతున్నాయి. రాజకీయ నేత భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనిక రెడ్డి ని పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ కి ఇదివరకే ప్రణతి రెడ్డితో వివాహం జరిగింది.

కానీ వీరిద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఇక మనోజ్ మౌనిక రెడ్డి తో కలిసి తను స్నేహితుడు సీతాఫ‌ల్ మండిలో ఏర్పాటుచేసిన గణేష్ మండపంకి వచ్చి పూజలు చేశారు. ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా జోరుగా సాగుతున్నాయి. వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియా మొత్తం కోడై కూసింది. ఇక మనోజ్ పుకార్లకు స్పందించి అలాంటిదేమీ లేదని కొట్టి పారేశాడు.

మరి మౌనిక రెడ్డితో మనోజ్ కు మూడు సంవత్సరాల క్రితం నుండి పరిచయం ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళిద్దరికీ మూడు సంవత్సరాల క్రితం చెన్నైలో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తుంది. వీరిద్దరూ హైదరాబాదులో కలుసుకుంటారని తెలుస్తుంది. ఆ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారట. ఇక కేవలం ఆదివారం రోజుల్లోనే వీరిద్దరూ కలుసుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. మనోజ్ పెళ్లి విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. మరి ఈ విషయం గురించి మనోజ్ విధంగా స్పందిస్తాడో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -