Manchu Manoj: వైరల్ అవుతున్న మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు!

Manchu Manoj: టాలీవుడ్ హీరో మంచు మనోజ్.. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతున్న పేరు. తరచూ ఏదో ఒక విషయంతో సోషల్ మీడియాలో మంచు మనోజ్ పేరు మారుమోగుతూనే ఉంది. ఇటీవలె మంచు మనోజ్ భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ అది రెండవ వివాహం అన్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే హీరో మంచు మనోజ్ తన భార్య మౌనిక రెడ్డి తో కలిసి ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలో షోలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోని ఈటీవీలో ప్రసారమవుతున్న అలా మొదలైంది షోకి తన భార్య మౌనిక రెడ్డితో కలిసి హాజరయ్యారు మంచు మనోజ్.

కాగా అలా మొదలైంది షోకి కమెడియన్ వెన్నెల కిషోర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెన్నెల కిషోర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంలో తెలిపారు మంచు మనోజ్. ఈ నేపథ్యంలోనే వెన్నెల కిషోర్ ప్రశ్నిస్తూ..ఒకరిపై ఒకరికి ఇష్టం ఉందనే విషయం మొదట ఎవరికి అనిపించింది?ఎవరు చెప్పారు? అని అడగగా ఆ విషయంపై స్పందించిన మంచు మనోజ్.. మొదటి నేను చెప్పాను. నా జీవితంలో ఎదుర్కొన్న బాధలే చాలా పెద్దవి అనుకున్నాను. కొద్దీ రోజులపాటు ఏ పని చేసే వాడిని కాదు. ఆ సమయంలో మౌనిక పడిన కష్టాలు చూసిన తర్వాత నా బాధలు చాలా చిన్నవి అనిపించాయి. అప్పుడు నేను నేరుగా మౌనిక దగ్గరికి వెళ్లి నువ్వంటే ఇష్టం ప్రాణం అని చెప్పాను.

మళ్లీ సంతోషం ఆశ జీవితంలో వెలుగు వస్తుందంటే అది నీ వల్లే. నాకు హ్యాపీగా బతకాలని ఉంది నలుగురితో సంతోషంగా ఉండాలని ఉంది నువ్వు ఒప్పుకుంటే బాబుని నా జీవితంలోకి ఆహ్వానిస్తాను అని చెప్పాను అప్పుడు మౌనిక సరిగానే ఆలోచించావా అని అడిగింది. ఈ సొసైటీ గురించి ఆలోచించావా? ఇంట్లో ఒప్పుకొంటారా అని అడిగింది. అవన్నీ నేను పట్టించుకోను. ఇంట్లో నేను ఒక మాట చెబితే నో చెప్పరు. పైగా అది నా సమస్య. అవన్నీ నేను చూసుకుంటాను అని చెప్పాను. తను కూడా ఓకే చెప్పేసింది. శివుడికి వినాయకుడు దొరికినట్లు నాకు బాబు దొరికాడు. ఆ తర్వాతే మా వనవాసం మొదలయ్యింది అని చెప్పుకొచ్చారు మనోజ్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -