Manchu Vishnu: సినిమాల గ్యాప్ పై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ వైరల్!

Manchu Vishnu: సీనియర్ నటుడు మెహన్ బాబు కొడుకుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు మంచు విష్ణు. బాల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఇతను.. 2003లో ‘విష్ణు’ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అందుకుంది. ఈ సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత ‘సూర్యం, పొలిటికల్ రౌడీ, అస్త్రం, గేమ్’ వంటి సినిమాలు చేశారు. ఊహించిన స్థాయిలో ఈ సినిమాలు ఆడనప్పటికీ.. ఓ మాదిరిగా కలెక్షన్లు రాబట్టాయి. ‘ఢీ’ సినిమాతో మంచు విష్ణుకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘కృష్ణార్జున, సలీమ్, దేనికైనా రెడీ, దూసుకెళ్తా, పాండవులు పాండవులు తుమ్మెద, డైనమైట్, ఓటర్, మోసగాళ్లు’ సినిమా చేశారు. ఈ సినిమాలు ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ఇండస్ట్రీయల్ హిట్ అందుకున్న దాఖలాలు లేవు.

 

ఈ ఏడాది ఎలాగైన హిట్ కొట్టాలని ‘జిన్నా’ సినిమాతో మంచు విష్ణు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా కూడా బోల్తా కొట్టింది. సినిమా విడుదలకు ముందు బిగ్గెస్ట్ హిట్ అవుతుందని బాగానే ప్రచారం జరిగింది. కానీ విడుదలైన తర్వాత ఊహించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అప్పటికే విడుదలైన ‘కాంతార, సర్దార్’ సినిమాలు పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లడంతో.. ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు. కమర్షియల్ హిట్‌గా నిలిచింది. అయితే జిన్నా సినిమా విడుదలకు ముందు మంచు విష్ణు ఓ ఛానెల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఇందులో తన కెరీర్ డ్రాప్ అవ్వడానికి గల కారణాలను చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

‘మీ తోటి సహా నటులు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసి.. స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. వాళ్లవి ఏడాదికి రెండు, మూడు సినిమాలైన రిలీజ్ అవుతున్నాయి. కానీ మీ సినిమాలు రెండేళ్లయినా విడుదలకు నోచుకోవడం లేదు. దానికి కారణం ఏంటి?’ అని యాంకర్ ప్రశ్నించగా.. ‘కొన్ని తప్పులు చేశాను. ఆ తప్పులు రిపీట్ కాకుండా చూసుకుంటాను.’ అని మంచు విష్ణు సమాధానం చెప్పారు. ‘మా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చారా?’ అని యాంకర్ అడగగా.. ’90 శాతం హామీలు నెరవేర్చాను. త్వరలో మిగిలిన హామీలు పూర్తి చేస్తాను.’ అని చెప్పారు.

 

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: వైఎస్ షర్మిల షాకింగ్ ప్లాన్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

YS Sharmila: వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఉద్దేశపూర్వకంగానే కలిసిందా.. దీని వెనక...
- Advertisement -
- Advertisement -