Mandapeta: ఆ నియోజకర్గానికి వైసీపీ అభ్యర్థి ఫిక్స్? కన్ఫార్మ్ చేసిన జగన్

Mandapeta: ఏపీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి రెండోసారి సీఎం పీఠాన్ని దక్కించుకునేందుకు సీఎం వైఎస్ జగన్ ఇప్పటినుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉండగానే.. ఇప్పుడే ఎన్నికలపై దృష్టి పెట్టారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపుపై నేతలకు పలు కీలక సూచనలు చేస్తోన్నారు. అలాగే నియోజకవర్గాల సమీక్షల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఎవరికిచ్చేదనేది ఫిక్స్ చేస్తోన్నారు. దాదాపు ఎన్నికలకు ఏడాదిన్నర ముందే జగన్ అభ్యర్థులను ఫిక్స్ చేస్తుండటంతో.. ఏపీలో ఇప్పటినుంచే ఎన్నికల వేడి మొదలైంది.

 

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని మండపేట నియోజకవర్గంపై జగన్ సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం ఎలాంటి వ్యూహలు అనుసరించాలనేది నేతలకు వివరించారు. ఈ సందర్బంగా జగన్ టికెట్ ను ఫిక్స్ చేశారు. మండపేట నుంచి తోట త్రిమూర్తులకు జగన్ టికెట్ కన్ఫార్మ్ చేసినట్లు చెబుతున్నారు. రాజకీయంగా బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన నేతగా ఆయన పేరు ఉంది. రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గత ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి వైసీపీ అభ్యర్థి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణపై పోటీ చేసి తోట త్రిముర్తులు ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరారు.

 

అయితే మండపేట నుంచి తోట త్రిముర్తులను బరిలోకి దింపాలని జగన్ భావిస్తున్నారు. మండపేట నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వేగుళ్ల జోగోశ్వేరరావు గెలిచారు. అక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన జగన్.. ఆయను మండపేట నియోకవర్గానికి ఇంచార్జ్ గా చేవారు. గత ఎన్నికల్లో ఒకసారి మండపేట నుంచి పోటీ చేసి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోవడం, వైసీపీ పదవి ఉండటంతో.. మండపేట వైసీపీ టికెట్ ను తోట త్రిమూర్తులకు జగన్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

 

తూర్పు గోదావరి జిల్లాలో కాపుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాపు సామాజికవర్గంలో బలమైన నేతగా తోట త్రిమూర్తులు ఉన్నారు. మండపేట నియోజకవర్గంలో జనసేన ప్రభావం బాగా ఎక్కువగా ఉంది. అందుకే తోట త్రిమూర్తులకు పోటీలోకి దింపాలని జగన్ యోచిస్తోన్నారు. గత ఎన్నికల్లో మండపేట నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధి వేగుళ్ల లీలాకృష్ణకు 35 వేలకుపైగా ఓట్లు వచ్చాయంటే ఇక్కడ జనసేన ఎంత బలంగా ఉందో అర్ధం అవుతుంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తే మండపేట నియోజకవర్గంలో వైసీపీకి కష్టంగా మారే అవకాశముంది.

 

ఈ క్రమంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలపై జగన్ ముందుగా ఫోకస్ పెట్టారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్నారు. అందులో భాగంగా ఇప్పటికే కుప్పం, అద్దంకి, టెక్కలి నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టిన జగన్… ఇప్పుడు మండపేట నియోజకవర్గంపై ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీ 23 సీట్లను గెలుచుకోగా.. అందులో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ వైపు మళ్లారు. దీంతో ప్రస్తుతం 19 మంది టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ 19 సీట్లలో వైసీపీ జెండా ఎగురవేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తోన్నారు.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -