Mangalsutra: తాళిబొట్టు గురించి పురాణాలు ఏం చెబుతున్నాయంటే..

Mangalsutra: హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లయిన స్త్రీలు తాళిబొట్టు ధరించడం తప్పనిసరి. వివిధ ప్రాంతాల్లో పలు రకాల సంప్రదాయాలు కొనసాగుతుంటాయి. ఇందులో మంగళసూత్రం ముఖ్యమైనది. వివాహిత అయిన స్త్రీ తాళిబొట్టును ఎదుటి వ్యక్తులకు కనిపించకుండా దాచుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వెనుక చారిత్రక నేపథ్యం ఉందని పెద్దలు చెబుతున్నారు.

 

ఏదైనా కారణాల చేత తాళిబొట్టు తెగిపోతే దాని స్థానంలో వెంటనే పసుపుకొమ్ము వేసుకుంటూ ఉంటారు. పూర్వం నల్లపూసల దండ అందరూ వేసుకొనే వారు. ఇప్పుడు చాలా మంది ఈ నల్లపూసల దండను వేసుకోవడం తగ్గించేశారు. కేవలం బంగారు గొలుసుకు తాళిబొట్టు వేసుకొని దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, నల్లపూసల దండ వల్ల అనేక రకాల ఉపయోగాలున్నాయని పెద్దలు సూచిస్తున్నారు. పూర్వ కాలంలో నల్లమట్టితో తయారు చేసిన పూసల దండలో తాళిబొట్టును ధరించేవారని చెబుతున్నారు.

 

మట్టితో చేసిన నల్లపూసల దండ ఛాతిపై వేసుకోవడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే వేడిని ఇవి పీల్చుకుంటాయని చెబుతున్నారు. దాంతోపాటు పాలిచ్చే తల్లికి పాలను పెంచుతాయని చెబుతారు. దాని స్థానంలో ఇప్పుడు బంగారు గొలుసు వేసుకోవడం వల్ల వేడి మరింత పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. ఆధ్యాత్మిక దృష్టితో చూసినప్పుడు హృదయమధ్య భాగంలో అనాహత చక్రం ఉంటుందని చెబుతారు. గొంతు భాగంలో సుషుమ్న, మెడ భాగంలో విశుద్ధ చక్రం ఉంటుందట.

 

భర్తకు మాత్రమే కనిపించేలా ధరించాలి..
ఈ చక్రాలపై నల్లపూసలు వేసుకోవడం వల్ల గుండె, గొంతు భాగాల్లో వేడి నశించి రోగాలు రాకుండా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. అందుకే అనాదిగా ఈ తరహా సంప్రదాయాన్ని స్త్రీలు పాటిస్తూ వస్తున్నారని, ప్రస్తుతం మహిళలు చాలా మంది దీన్ని విస్మరించారని చెబుతున్నారు. స్త్రీలు మంగళసూత్రాన్ని భర్తకు మాత్రమే కనిపించేలా ధరించాలని చెబుతున్నారు. పూర్వ కాలంలో మంగళసూత్రం నల్లపూసల దండలోనే వేసుకొనే వారు. కాలక్రమంలో కొందరు నలుపు రంగును ఎలా ఉంచుతారనే సందేహాలు వెలిబుచ్చారు. క్రమంగా వివాహానికి సంబంధించిన అన్ని సంప్రదాయాల్లో నలుపు రంగును అవాయిడ్‌ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -