Mangli: వామ్మో.. మంగ్లీకి జగన్ అంత వేతనం ఇస్తున్నారా?

Mangli: టాలీవుడ్ ప్రేక్షకులకు తన పాటలతో మత్తెక్కించే మంగ్లీ గురించి అంతగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రేలా..రేలా….రే.. పాటతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ తెలంగాణ గాణ కోయిల ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సైతం తన స్వరాన్ని అందిస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో తన పాటలకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మంగ్లీ తన పాటలకు ఎంతో పేరు సంపాదించుకుంది.

 

కేవలం సినిమాలలోని పాటలే కాకుండా.. జానపద పాటలకు కూడా తన అద్భుతమైన గొంతుతో మంగ్లీ అందరి మదిలో చేరింది. ఇక తెలంగాణలో వచ్చే ప్రతి పండుగకు తన ఆల్బమ్ కచ్చితంగా వస్తుంది. అంతేకాకుండా యాంకర్ గా కూడా చేసి తన గలగల మాటలతో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తనకు అరుదైన గౌరవం దక్కింది.

టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్ సలహాదారుగా మంగ్లీ ని నియమించాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఇక ఈ పదవిలో మంగ్లీ రెండేళ్ల పాటు కొనసాగునుంది. దీంతో ఆమెకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నెలకు రూ. లక్ష వేతనం అందనిందని తెలిసింది. ఈ ఏడాది మార్చిలో ఎస్ వి బి సి సలహాదారుల నియమిస్తూ ప్రభుత్వం ఉత్పరులు జారీ చేయగా ఇటీవల ఆమె ఆ బాధ్యతలు చేపట్టింది.

ఇక ఈమె వైఎస్ జగన్ కి సంబంధించిన పాటలు కూడా పాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా గతంలో మంగ్లీ వైయస్సార్ పార్టీ తరఫున కూడా ప్రచారం చేసింది. ఇక ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ మంగ్లీ కి ఈ అరుదైన గుర్తింపు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే మంగ్లీ కి నెలకు రూ. లక్ష వేతనం వస్తుందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -