Mani Shankar: మణి శంకర్ సినిమా ట్రైలర్ అద్భుతంగా ఉంది

Mani Shankar: డబ్బు చుట్టూ తిరిగే ఒక ఆసక్తికర కథ, కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘మణిశంకర్’ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో శివ కంఠమనేని, సంజ‌న గ‌ల్రాని, ప్రియా హెగ్దే, చాణ‌క్య ప్ర‌ధాన పాత్ర‌ల‌లో నటించారు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు జి.వి.కె(జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌) అందించారు. అలాగే ఈ సినిమాకు జి.వి.కే దర్శకత్వం వహించారు. లైట్ హౌస్ సినీ క్రియేషన్స్ ప‌తాకంపై కె.ఎస్. శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణిభూషణ్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి రీలీజ్ అయిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

తాజాగా ‘మణిశంకర్’ సినిమా ఆడియో లాంచ్ ను వేడుకగా నిర్వహించారు. ఆడియో లాంచ్ కు ముఖ్య అతిథిగా ప్ర‌ముఖ న‌టుడు మురళీ మోహన్, ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ళ్యాణ్, న‌టులు అశోక్ కుమార్ విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా మ‌ణిశంక‌ర్ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి ఆవిష్క‌రించారు. ఆడియో లాంచ్ లో మురళీ మోహన్ మాట్లాడుతూ తాము రియల్ ఎస్టేట్‌లో భాగస్వాములం అని అన్నారు. శంకర్ తీసిన మణిశంకర్ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శివ కంఠమనేని హీరోగా, నిర్మాతగా రావడం గొప్ప విషయమన్నారు. అశోక్, కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలో పెద్దవారని, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా కళ్యాణ్ అందుబాటులో ఉండి పరిష్కరిస్తారని తెలిపారు.

 

సంజనతో కలిసి చాలా సినిమాల్లో నటించానని ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే డబ్బు చుట్టూ కథ సాగేవిధంగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మురళీ మోహన్ కోరారు. ప్ర‌ముఖ నిర్మాత సీ కళ్యాణ్ మాట్లాడుతూ తండ్రి ఇష్టాలను తెలుసుకుని, వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న శంకర్ కొడుకుల‌కి థాంక్స్ చెప్పారు. సినిమాలో శివ నటనను చూసి తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. ఈ సినిమా విజయవంతం అవ్వాలని ఆశిస్తున్నానన్నారు.

 

వీఐపీ ప్రైమ్‌ సీఈవో సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ మణిశంకర్ సినిమా కథను డైరెక్టర్ తనకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే తాను పట్టించుకోలేదని అన్నారు. ఈ సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. సంక్రాంతికి ఈ సినిమా రాబోతోందని, నేరుగా ఓటీటీకి ఓ సినిమాను కొన్నామంటే ఇందులో ఎంత డెప్త్ ఉందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. తాను సచిన్ జోషి హీరోగా మౌనమేలనోయి సినిమాను నిర్మించినట్లు తెలిపారు.

 

హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ మ‌ణిశంక‌ర్ మంచి కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతోందని అన్నారు. తన ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో సినిమా తీసినట్లు తెలిపారు. ద‌ర్శకుడు జీవీకే మంచి విజ‌న్ తో ఈ సినిమాను తెరకెక్కించారని వెల్లడించారు. ఇళయరాజా శిష్యుడు ఎం ఎల్ రాజా తమ సినిమాకు మంచి సంగీతం అందించారని, డీఓపీ జేపీ ఎంతో సహకరించారని తెలిపారు.

 

డైరెక్టర్ జి. వెంక‌ట్‌ కృష్ట‌ణ్‌ మాట్లాడుతూ శంకర్‌ కథ విన్న వెంటనే సోల్ పట్టేసుకున్నారని, అద్భుతంగా నటించారని తెలిపారు. ప్రియా హెగ్దే, చాణ‌క్యలు పోషించిన పాత్రలు అద్భుతంగా పండాయని తెలిపారు. జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో సినిమాటోగ్రాఫ‌ర్ జే ప్రభాక‌ర్ రెడ్డి, సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎల్ రాజ, చిత్ర యూనిట్ పాల్గొన్నారు.

 

సాంకేతిక వ‌ర్గం:
క‌థ‌, స్క్రీన్ ప్లే, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం: జి. వెంక‌ట్ కృష్ణ‌న్ (జీవికే)
నిర్మాత‌లు: కె.ఎస్.శంకర్ రావు, ఆచార్య శ్రీ‌నివాస‌రావు, ఎం. ఫణి భూషణ్
బ్యాన‌ర్‌: లైట్ హౌస్ సినీ క్రియేషన్స్
సినిమాటోగ్ర‌ఫి: జె. ప్ర‌భాక‌ర్ రెడ్డి
సంగీతం: ఎం.ఎల్.రాజా
ఎడిట‌ర్‌: స‌త్య గిదుటూరి
ఆర్ట్‌: షేరా
ఫైట్స్‌: వింగ్‌చున్ అంజీ
లిరిక్స్‌: పేదాడ మూర్తి
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్: ఎం.కె బాబు
పీఆర్ఓ: సిద్ధు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -