maniraj: మణిరాజ్ దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ పూర్తి.?

maniraj: పి.మణిరాజ్ దర్శకత్వంలో పృథ్వీరాజ్, అనూ మెహత కలిసి నటించిన తాజా చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1. ఈ సినిమాతో పి.మణిరాజ్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. పిఎస్ఆర్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకం పై రూపొందిన ప్రొడ‌క్ష‌న్ నెం.1సినిమా రాబ‌రీ నేప‌థ్యంలో క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కనుంది. ఈ సినిమాను పి.నాగ‌మ‌ణి స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌వీణ శివరాజ్ ఈ సినిమాని నిర్మించారు. అయితే కొత్త తరహా కథ కథనంతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ఒక ఆసక్తికరమైన టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ మీడియాతో ముచ్చటించారు. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు పి. మ‌ణిరాజ్ మాట్లాడుతూ ఈ సినిమాను 27 రోజుల పాటు వికారాబాద్‌, హైద‌రాబాద్ మ‌రియు ప‌రిసర ప్రాంతాల్లోని అంద‌మైన లోకేష‌న్ లలో చిత్రీకరించాము అని తెలిపారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అవుట్ ఫుట్ కూడా చాలా బాగా వచ్చిందని హీరో పృథ్విరాజ్‌, హీరోయిన్ అనూ మెహత కూడా చాలా చక్కగా నటించారు అని తెలిపారు దర్శకుడు మణిరాజ్.

అలాగే ఈ సినిమా కోసం టెక్నీషియన్స్ కూడా పూర్తి సహకారం అందించారని, సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.. ఇక ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా పూర్తి నవంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు మణిరాజ్. అదేవిధంగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా విడుదల చేస్తామని తెలిపారు. అదేవిధంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఇప్పిస్తుంది అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -