Manjusha: మంజూషకు చుక్కలు చూపించిన ఫ్యాన్స్.. ఏం అడిగాడంటే?

Manjusha: కరోనా లాక్‌డౌన్‌లో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. సోషల్ మీడియా ద్వారా చాలా మంది స్టార్ హోదాను పొందారు. హీరోయిన్లతోపాటు బుల్లితెర తారలు కూడా స్టార్లుగా మారాలు. పలు షోలకు యాంకరింగ్ చేసిన వాళ్లు సైతం సెలబ్రిటీ హోదాను పొందగలిగారు. అందుకు కారణం సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించుకోవడమే. నిజానికి గతంలో చాలా కొద్ది మందికి మాత్రమే స్టార్ హోదా దొరికేది. కానీ ఇప్పుడు టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ సెలబ్రిటీగా మారవచ్చు. అలా కొన్నేళ్లుగా స్టార్‌డమ్ సొంతం చేసుకున్న యాంకర్‌లలో మంజూష ఒకరు.

 

తన అందం, అభినయం, యాంకరింగ్, స్పాంటినిటీతో అభిమానులను సొంతం చేసుకున్నారు మంజూష. సినిమాలకు సంబంధించిన అన్ని ఈవెంట్లలో ఆమె యాంకర్‌గా కనిపిస్తుంటారు. సుమ, అనసూయ, రష్మి తర్వాత మంజూష కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్, క్రేజ్‌ను సంపాదించుకున్నారు. తాజాగా ‘మట్టికుస్తీ’ అనే సినిమా ఈవెంట్‌లో యాంకర్‌గా మంజూష కొనసాగారు. ఈవెంట్ ప్రారంభంలో మంజూష అక్కడికి వచ్చిన అభిమానులతో కాసేపు సరదాగా మాట్లాడారు. అభిమానుల్లో ఓ వ్యక్తి మైక్ పట్టుకుని తన ఫేవరేట్ హీరోయిన్ గురించి చెప్పుకొచ్చాడు. ఐశ్వర్య లక్ష్మి నటన అంతే తనకు ఇష్టమని, ఆమె కనిపించినప్పుడు ఈ విషయం చెప్పాలని అభిమాని మంజూషను కోరాడు.

 

 

ఆ తర్వాత యాంకర్ మంజూషపై పొగడ్తల వర్షం కురిపించాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి మంజూషతో మాట్లాడుతూ.. ‘మీ యాంకరింగ్ అంటే చాలా ఇష్టం. మా అన్న ఓంకార్‌కు మీరంటే ఇంకా ఇష్టం. తను మీకు బిగ్ ఫ్యాన్. ఇటీవల జబర్దస్త్ కు కొత్త యాంకర్‌గా మీరు వస్తున్నారని వార్తలు వినిపించాయి. అసలు మీరే జబర్దస్త్ షోలో యాంకర్‌గా వస్తారని అనుకున్నాం.’ అని పేర్కొన్నాడు. జబర్దస్త్ యాంకర్ అన్నప్పుడే.. మంజూష మధ్యలో ఎంటరై.. ఇంక చాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, గతంలో జబర్దస్త్ కొత్త యాంకర్ అన్నప్పుడు మంజూష పేరు విపరీతంగా వినిపించింది. ఆమెనే యాంకర్‌గా వస్తుందని అనుకున్నారు. కానీ లాస్ట్ లో తెరపై కన్నడ బ్యూటీ సౌమ్యరావును తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. కాగా, ప్రస్తుతం మంజూష-అభిమాని మధ్య జరిగిన కన్వర్జేషన్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -