Mankading: మరోసారి తెరపైకి మన్కడింగ్ అవుట్.. జంపాకు నిరాశ

Mankading: క్రికెట్‌లో మన్కడింగ్ అవుట్ గురించి చాలా మందికి అవగాహన ఉంది. నాన్‌ స్ట్రైకర్‌ను ఓ బౌలర్‌ బాల్ వేయక ముందే రనౌట్‌ చేయడాన్ని మన్కడింగ్‌ అని పిలుస్తారు. అయితే ఈ అవుట్ వివాదాస్పదంగా మారింది. తాజాగా క్రికెట్‌లో కొత్త రూల్స్ రావడంతో దీనిని సాధారణ అవుట్‌గానే పరిగణిస్తున్నారు. ఐపీఎల్ సందర్భంగా ఓసారి ఇండియన్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ రాజస్థాన్ ఆటగాడు జాస్ బట్లర్‌ను మన్కడింగ్ ద్వారా అవుట్ చేయడం దుమారం రేపింది.

 

మన్కడింగ్ అవుట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమంటూ చాలామంది ఆరోపిస్తున్నారు. అయితే క్రికెట్‌లో ఇది కూడా ఓ భాగమనే సంగతి మరుస్తున్నారు. బిగ్‌బాష్‌ లీగ్‌లోనూ ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా అచ్చూ అశ్విన్‌లాగే నాన్‌ స్ట్రైకర్‌ను రనౌట్‌ చేశాడు. తాను బౌలింగ్‌ చేయడానికి వెళ్తూ నాన్‌ స్ట్రైకర్‌ క్రీజు వదలడం చూసి వికెట్లను గిరాటేశాడు. దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేశాడు.

 

అయితే ఆశ్చర్యకరంగా థర్డ్ అంపైర్ దీనిని నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో ఫీల్డింగ్ చేస్తున్న జట్టుతో పాటు ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. ఇది నాటౌట్ అని ప్రకటించడమేంటని సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. అయితే ఇక్కడ థర్డ్‌ అంపైర్‌ నాటౌట్‌గా డిక్లేర్‌ చేయడానికి ఓ కారణం ఉంది. అప్పటికే బౌలర్‌ బాల్‌ వేయడానికి తన చేతిని పూర్తిగా తిప్పాడు. ఆ సమయంలో బాల్‌ డెలివర్‌ చేయకుండా వెనక్కి వచ్చి వికెట్లను గిరాటేశాడు.

 

నాటౌట్‌గా ఎలా ప్రకటిస్తారు?
ఆడమ్ జంపా చేసిన మన్కడింగ్ అవుట్‌ను నాటౌట్‌గా ప్రకటించడాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ కూడా తప్పుబట్టాడు. దీనిని నాటౌట్‌గా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించాడు. మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌, మెల్‌బోర్స్‌ స్టార్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్రీజు వదిలి రోజర్స్‌ అడ్వాంటేజ్‌ తీసుకోవడం లేదని ఎలా చెబుతారని.. బౌలర్‌ బాల్‌ను రిలీజ్‌ చేయకముందే అతడు క్రీజును వదిలాడని హాగ్ చెప్పాడు. బౌలింగ్‌ యాక్షన్‌ పూర్తయిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా అది అవుట్ అని.. జంపా అప్పీల్‌కు పూర్తి హక్కు ఉందన్నాడు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -