TDP: టీడీపీలో భారీ మార్పులు.. వచ్చే ఎన్నికలకు రంగం సిద్దమవుతుందా?

TDP: టీడీపీ అధినేత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్‌ను చంద్రబాబు నియమిస్తూ ప్రకటన జారీ చేశారు. ఇటీవలే చంద్రబాబు సమక్షంలో కాసాని టీడీపీలో చేరారు. అంతలోనే ఆయనకు టీటీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నిర్సింహులు ఉన్నారు. ఆయనను ఇప్పుడు తప్పించి కాసాని జ్ఞానేశ్వర్ కు అప్పగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

కాసాని జ్ఞానేశ్వర్ గతంలో టీడీపీలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో ఆయన పనిచేశారు. రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా కూడా పనిచేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా టీడీపీకి కాసాని దూరంగా ఉంటున్నారు. చాలాకాలం పాటు టీడీపీకి దూరంగా ఉన్న ఆయన.. ఇటీవల హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబు సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన ఆయనకు ఆ సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. అలాగే తెలంగాణలో కూడా ఆయనకు పేరు ఉంది.

కాసాని టీడీపీలో చేరిప్పుడు ఆయనకు తెలంగాణ టీడీపీ అధ్యక్ష బాధతలను అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు నుంచి ఇప్పుడు అధికారికంగా ప్రకటన వచ్చింది. ఈ నెల 10న టీటీడీపీ అధ్యక్షుడిగా కాసాని బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు పొలిట్ బ్యూరోలో కూడా అవకాశం కల్పించారు.

ఇటీవల టీటీడీపీపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్న దగ్గర నుంచి చంద్రబాబు టీటీడీపీపై మరింత ఫోకస్ పెట్టారు. ప్రతి శనివారం ఎన్టీఆర్ భవన్ కు వచ్చానని, పార్టీ నేతలకు టచ్ లో ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికలకు పార్టీని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. ఇటీవల మునుగోడు ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేస్తుందనే ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా టీడీపీ పోటీ నుంచి తప్పుకుంది.

చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉండటంతో.. టీటీడీపీ కావాలనే మునుగోడు పోటీ నుంచి తప్పుకుందనే వార్తలొచ్చాయి. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు దగ్గర నుంచి చంద్రబాబు టీటీడీపీపై ఫోకస్ పెట్టారు. టీడీపీని ఆంధ్రా పార్టీగా కేసీఆర్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా ఏపీలో కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. అందుకే ఇప్పుడు గతంలో లాగా టీడీపీ ఆంధ్రా పార్టీ అని, చంద్రబాబు ఏపీ వ్యక్తి అని కేసీఆర్ విమర్శలు చేయడానికి వీలు పడదు. కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ద్వారా ఏపీలో రాజకీయం చేస్తారు కనుక.. చంద్రబాబు ఏపీ వ్యక్తి అని విమర్శలు చేసే వీలు ఉండదు.అందుకే బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చంద్రబాబు దృష్టి పెట్టారు.

ఏపీ రాజకీయాలను చూసుకుంటూనే శనివారం హైదరాబాద్ కు వస్తున్నారు. ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 12 సీట్లు తెలంగాణలో వచ్చాయి. ఇక గత ఎన్నికల్లో టీడీపీకి 2 సీట్లు రాగా.. వారిద్దరు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అయితే తెలంగాణలో టీడీపీకి ఇంకా సంస్థాగతంగా బలం ఉంది. టీడీపీకి క్యాడర్ కూడా బాగానే ఉంది. కానీ చంద్రబాబు ఫోకస్ పెట్టకపోవడంతో పార్టీ ఓటర్లు ఇతర పార్టీలకు వైపు మళ్లారు. చంద్రబాబు ఫోకస్ పెట్టి పార్టీని బలోపేతం చేస్తే తెలంగాణలో కింగ్ మేకర్ గా ఎదిగే అవకాశముందని అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -