Maruti Cars: రూ. 52 వేల డిస్కౌంట్ తో మారుతి కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్?

Maruti Cars: కొత్త ఈడాది ప్రారంభం కావడానికి మరి కొద్ది రోజుల్లో సమయం ఉంది. దీంతో ఆటోమొబైల్ కంపెనీలు వరుసగా ఆఫర్లను ప్రకటించడం కోసం సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే మారుతి సుజుకి కంపెనీ ఈ ఏడాది ముగింపుకు ఆఫర్ ప్రకటించింది. కార్ల విక్రయాల్లో సరికొత్త రికార్డు సృష్టించింది. మారుతీ సుజుకీ ఎంపిక చేసిన కార్లపై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. మారుతి ఈ సంవత్సరానికి వీడ్కోలు పలికేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం సంవత్సరాంతపు విక్రయాల ఆఫర్‌ను ప్రకటించింది. మరి ఏ ఏ కార్లపై ఏ మేరకు ఆఫర్లు ఇచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మారుతి సుజుకి ఆల్టో 800 కారు పై రూ.52,000 తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. అలాగర్ 30,000 నగదు తగ్గింపు, 15,000 రూపాయల ఎక్స్ఛేంజ్ బోనస్, 7,000 రూపాయల కార్పొరేట్ డిస్కౌంట్ లతో లభించనున్నాయి. మారుతి ఆల్టో కె10 మొత్తం ధర రూ. 57,000 తగ్గింపు ఆఫర్‌ను కలిగి ఉంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ. 7,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి. మారుతి ఎస్ ప్రెస్సో కారు పై మొత్తం రూ.65,000 తగ్గింపుతో ప్రకటించింది. ఇందులో రూ.45,000 నగదు తగ్గింపు, రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ.5,000 కార్పొరేట్ బోనస్ ఉన్నాయి.

 

ఎస్ ప్రెసో CND వేరియంట్ కోసం మొత్తం రూ.75,000 తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. రూ. 60,000 నగదు తగ్గింపు, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్‌ను కలిగి ఉంటుంది. మారుతి సుజుకి సెలెరియో కారుపై మొత్తం రూ.39,000 తగ్గింపు ఆఫర్ ఇవ్వబడింది. 20,000 రూపాయల నగదు తగ్గింపు, 15,000 రూపాయల మార్పిడి బోనస్, 4,000 రూపాయల కార్పొరేట్ బోనస్ ఇవ్వబడుతుంది. సెలెరియో కారు, సిఎన్‌జి వెర్షన్‌పై మొత్తం రూ.75,000 తగ్గింపు ఇవ్వబడింది. అలాగే ఇందులో రూ.60,000 నగదు తగ్గింపు కూడా ఉంటుంది. మారుతి సుజుకి వాగనర్ కారు పై మొత్తం రూ. 57,000 తగ్గింపును కలిగి ఉంది. 1.0 MT వేరియంట్ కారుపై 20,000 నగదు తగ్గింపు, 1.2 MT వేరియంట్ కారుపై 30,000 నగదు తగ్గింపు ప్రకటించింది. CNG వెర్షన్ కారుపై మొత్తం రూ.50,000 తగ్గింపును ప్రకటించారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -