Dog Attack: మాటేసి.. పబ్లిక్ లో యువతని కరిచిన వీధి కుక్క?

Dog Attack: ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కల అరాచకాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారి మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనే మరువకముందే నిత్యం ఏదో ఒక ప్రదేశంలో వీధి కుక్కల దాడులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ విషయం పట్ల ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వీధి కుక్కలు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఒక యువతిపై పబ్లిక్ లోనే దాడి చేసింది ఒక వీధి కుక్క.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే.. తాజాగా నానాక్ రాంగూడ లాంకో హిల్స్ వద్ద ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్నేహితురాలిని మందలించేందుకు వెళ్తున్న యువతి పై వీధి కుక్క దాడి చేసింది. పబ్లిక్ లో చుట్టూ జనాలు ఉన్నా ఏమాత్రం భయం లేకుండా ఆ కుక్క యువతి కాలిని కొరికింది. వెంటనే అది గమనించిన స్థానికులు కుక్కను తరిమివేశారు. అప్పటి వరకు తన స్నేహితురాళ్లతో మాట్లాడుతున్న మహిళపై మాటు వేసిన వీధి కుక్క అకస్మాత్తుగా దాడి చేసింది.

 

దాంతో ఆ యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అలర్ట్ అయి కుక్కను అక్కడ నుంచి తమిరివేశారు. కానీ అప్పటికే ఆ కుక్క యువతి కాలు కొరికేసిందీ. వెంటనే ఆ యువతిని ఆమె స్నేహితురాళ్లు వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది ఆ వీధి కుక్కల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల విషయంలో ప్రభుత్వం ఏదో ఒక కఠినమైన నిర్ణయం తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు నెటిజన్స్.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -