Goddess Lakshmi: దీపావళి రోజున ఈ చిట్కాలు పాటించండి.. లక్ష్మీదేవి కటాక్షం పొందండి..

Goddess Lakshmi: దీపావళి అంటే వెలుగుల పండుగ. చీకటిపై వెలుగు గెలిచిన రోజు. పురాణాల్లో నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించినందుకు ఆ మరుసటి రోజు ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ పండుగను ప్రతి ఏడాది అశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు అశ్వయుజ బహుళ చతుర్థశి వస్తుంది. దీన్ని నరక చతుర్థశిగా అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీపావళి పండుగను 5 రోజులపాటు జరుపుకుంటారు. అశ్వయుజ బహుళ త్రయోదళితో దీపావళి ప్రారంభమై.. కార్తీక శుద్ధ విదియ భగినీహస్తన వేడుకలు ముగుస్తాయి.

దీపావళి పండుగ రోజు ప్రజలు కొత్త బట్టలు ధరించి ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఘుమఘుమలాడే పిండి వంటలు వండుకుంటారు. ఈ ఏడాది దీపావళి పండుగ అక్టోబర్ 24వ తేదీన జరుపుకోనున్నారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజించడం అనవాయితీగా వస్తోంది. అయితే ఈ సారి దీపావళి పండుగ రోజు లక్ష్మీ పూజ సాయంత్రం 5.39 గంటలకు ప్రారంభమవుతోంది. అలాగే సాయంత్రం 6.51 గంటలకు పూర్తి కానుంది. అయితే దీపావళి పండుగ రోజు కొన్ని వాస్తు చిట్కాలు పాటించండి.

పాటించాల్సిన చిట్కాలు..

1. దీపావళి పండుగ రోజు ఇల్లును, ఆఫీస్‌ను శుభ్రం చేసుకోవాలి. అప్పుడు సానుకూల శక్తి ఇంట్లో ప్రవేశిస్తుంది. అలాగే వంటగది, స్టోర్ రూమ్‌లను కూడా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం పొందవచ్చు.

2. దీపావళి పండుగ రోజు పగలిన అద్దాలు, గ్యాడ్జెట్లు, బొమ్మలు, ఎలక్ట్రానిక్స్, పనికి రాని వస్తువులను ఇంటి నుంచి బయట పడేయాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు పరిశుభ్రంగా ఉంటుంది. ఇంట్లో కుటుంబసభ్యులకు కూడా శుభం జరుగుతుంది.

3. ఉత్తర, ఈశాన్య దిశలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇంటి ఉత్తర దిక్కుకు కుబేరుడు అధిపతి. ఉత్తర దిక్కులో వాస్తు దోషం ఉంటే మీరు ఆదాయాన్ని పొందలేరు. అలాగే లివింగ్ రూమ్‌లో ఉత్తర దిశలో అక్వేరియం ఏర్పాటు చేయాలి. అలాగే టెర్రస్‌పై పక్షులకు నీరు నింపిన గిన్నె ఉండటం అదృష్టంగా భావిస్తారు.

4. మీ ఇంటిని రంగురంగుల లైట్లు, పువ్వులు, కొవ్వొత్తులతో అలంకరించాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -