Meenakshi: అందాల ఆరబోతపై మీనాక్షి షాకింగ్ కామెంట్స్. ఏమన్నారంటే?

Meenakshi: టాలీవుడ్ లో గ్లామర్ షోలపై ఈ మధ్య పెద్ద చర్చే నడుస్తోంది. అయితే ఈ చర్చ కాస్త కొన్నిసార్లు రచ్చ గా మారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక గ్లామర్ ప్రదర్శన కొంతమంది నాయికలకు ఆయుధంగా మారింది. కేవలం అంగ ప్రదర్శనపైనే ఆధారపడి, అవకాశాలు పొందుతున్న వారూ ఉన్నారు. ఇక హీరోయిన్లు కూడా గ్లామర్ క్వీన్ గా పేరు తెచ్చుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు.

 

అందాలు చూపిస్తేనే అవకాశాలు..
అందం చూపిస్తేనే అవకాశాలు వస్తాయని గాఢంగా నమ్ముతున్న రోజులు ఇవి. కాబట్టి హీరోయిన్లు వాటినే నమ్ముతున్నారు. ఈ మధ్య స్టార్లు ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. ఇటీవల ఈ కోవలోకి మీనాక్షి చౌదరి చేరిపోయింది. “ఇచ్చట వాహనాలు నిలుపరాదు” సినిమాతో పరిచయం అయిన మీనాక్షి ఆ తర్వాత రవితేజతో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

 

ఇక ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేక పోవడంతో తనకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒకవేళ ఆ సినిమా పెద్ద హిట్ అయి ఉంటె తనకు అవకాశాలు బాగా వచ్చి ఉండేవి. దీనితో మీనాక్షి తెలుగు ప్రేక్షకులకుపై, దర్శక నిర్మాతలపై బాగా పెంచుకున్నట్టు ఉందో.. ఏమో.. తెలియదు కానీ, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

 

మీనాక్షి మాట్లాడుతూ “ఏ ఇండస్ట్రీలో నైనా రాణించాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదు. ఇంకా చాలా చేయాల్సి ఉంటుంది. దానిలో గ్లామర్ షో కూడా ఒకటి. కొందరు మా డ్రెస్సింగ్ సెన్స్ పై కామెంట్స్ చేస్తున్నారు. చూపిస్తేనే ఛాన్సులు వస్తున్నాయి. అందరూ అదే చేస్తున్నారు.. నేను అదే ఫాలో అవుతున్న. తప్పేముంది” అని చెప్పుకొచ్చింది. గ్లామర్ షో గురించి మీనాక్షి ఇలా ఓపెన్ గా మాట్లాడటం వైరల్ అవుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -