Vijay Sai Reddy: నాగ్ కనిపించాడు చిరంజీవి కనిపించలేదా.. విజయసాయిరెడ్డిపై ట్రోలింగ్!

Vijay Sai Reddy: తెలుగు ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి అతడి నటన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుత టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక యంగ్ హీరోలతో సమానంగా సినీ అవకాశాలు అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు చిరు. కాగా అక్టోబర్ ఐదు న గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఇక మన్మధుడు నాగార్జున విషయం మనందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రస్తుతం అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. దాదాపు ఆరుపదులు వయసు వచ్చినప్పటికీ ఇప్పటికీ చెక్కుచెదరని అందం నాగార్జున సొంతం. ప్రస్తుతం నాగార్జున కూడా ది గోస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జున ది గోస్ట్ సినిమాకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక ఈవెంట్ నిర్వహించాడు.

ఆ ఈవెంట్ ను చిత్ర బృందం భారీ స్థాయిలో నిర్మించింది. ఇక ఈవెంట్ జరపటంపై విజయసాయిరెడ్డి నాగార్జునను ప్రశంసించాడు. అయితే ఇటీవలే అనంతపురంలో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ ఈవెంట్ ను నిర్వహించారు. అయినా కూడా విజయసాయిరెడ్డి చిరంజీవి గురించి ఏమీ స్పందించలేదు. ఈ విషయం కనిపెట్టిన నెటిజన్లు విజయసాయిరెడ్డిని ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. కర్నూల్లో ఈవెంట్ జరిపిన నాగార్జున మాత్రమే కనిపించాడా.. అనంతపురంలో భారీ స్థాయిలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన చిరంజీవి కనిపించలేదా అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

మరికొందరు ఈ విషయంలో కూడా విజయసాయిరెడ్డి రాజకీయం చేస్తున్నాడని దుమ్మెత్తి పోస్తున్నారు. ఏదేమైనా విజయసాయిరెడ్డిని నెట్టింట్లో ఒక రేంజ్ లో ఆడిపోసుకుంటున్నారు. మరి ఈ ట్రోల్ల్స్ గురించి విజయసాయిరెడ్డి ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి. ఇక మెగాస్టార్ చిరంజీవి అభిమానులైతే విజయసాయి రెడ్డి పై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కామెంట్ల రూపంలో పచ్చి బూతులు తిడుతున్నారు. గత కొన్ని గంటలుగా విజయ సాయి రెడ్డి జనం నోటిలో నానుతున్నాడు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయని జగన్.. ఇంతకంటే ఘోరం ఉందా?

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో భాగంగా పాదయాత్ర చేస్తూ ఎన్నో హామీలను ఇచ్చారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు భారీ స్థాయిలో ఎన్నికల హామీలను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి...
- Advertisement -
- Advertisement -