Mega Fans vs Nandamuri Fans: వామ్మో.. అన్ని సెంటర్లలో చిరు, బాలయ్యలకు అన్యాయం జరుగుతోందా?

Mega Fans vs Nandamuri Fans: సంక్రాంతి వస్తోందంటే చాలు రిలీజ్ అవ్వడానికి చాలా సినిమాలు సిద్ధమవుతూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ సినిమాల మధ్య పోటీ కూడా ఉంటుందనే చెప్పాలి. ఈసారి సంక్రాంతి బరిలో భారీ అంచనాలతో రెండు పెద్ద సినిమాలు విడుదల అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ బడా హీరో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

 

ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్ లో విడుదలవుతున్నప్పటికీ థియేటర్ల మాఫియాపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత కొంత కాలంగా చిన్న హీరోలు, చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా పాలిటిక్స్ చేస్తున్నారన్న విమర్శలు కనిపిస్తున్నాయి. ఇలాంటివి గత 8 ఏళ్లుగా వింటూనే ఉన్నాం. అయితే ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు సైతం థియేటర్లు దొరకని పరిస్థితి నెలకొంది.

 

కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ తో దిల్ రాజు వారసుడు అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ సినిమానే అయినా దిల్ రాజు స్వయంగా నిర్మిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమానే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ థియేటర్లలో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజుకు సొంత థియేటర్లు చాలానే ఉన్నాయి. ఆయన ఆధీనంలోనే చాలా మంది ఎగ్జిబిటర్లు ఉన్నారు. వారికి సంబంధించిన థియేటర్లలో కూడా వారసుడు సినిమానే విడుదల చేయనున్నారు.

 

ఏపీ, తెలంగాణలో చూస్తే సింగిల్ స్క్రీన్లు ఉన్నటువంటి 200 ప్రాంతాల్లో వారసుడు సినిమానే విడుదల కానుంది. అంటే ఈ 200 థియేటర్లలో బాలయ్య, చిరంజీవి సినిమాలు ఉండవన్నమాట. తెలుగు వాళ్ల పెద్ద పండగ అయిన సంక్రాంతి రోజు ఇలా స్టార్ హీరోల సినిమాలు చూసే భాగ్యం ఆ 200 ప్రాంతాల్లో ఉండవు. డబులు స్క్రీన్లు ఉన్న పల్లెటూర్లు, పట్టణాల్లో సైతం వారసుడు విడుదల కానుంది. ఈ ప్రాంతాల్లో బాలయ్య, చిరంజీవి సినిమాల్లో ఒకటే ఆడనుంది. ఒక వేళ వారసుడు ప్లాప్ అయితే ఆ స్థానంలో కళ్యాణం కమనీయం అనే సినిమాను ప్రదర్శించనున్నారు. దీంతో బాలయ్య, చిరంజీవి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -