MegaHero: కోట్ల ఆస్తి ఉన్న మెగా హీరో ఇంత ఛండాలంగా ప్రవర్తించడా?

MegaHero: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వెంబడి సినిమాల కోసం నిర్మాతలు క్యూ కడుతుంటారు. తమ సినిమాల ఓకే చేయడానికి ముందుగానే అడ్వాన్సు కూడా చెల్లించి.. అతడి షెడ్యూల్ కోసం వేచి చూస్తుంటారు. రోజులు గడిచే కొద్ది సినిమాలు చేస్తారా? లేదా అనే క్లారిటీ ఉండదు. హీరోల కరుణ కోసం ఎదురుచూస్తూ వడ్డీలు కట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ సినిమా సెట్ కాకపోతే కొందరు హీరోల అడ్వాన్సులు తిరిగి ఇచ్చేస్తుంటారు. మరికొందరు డబ్బులు వాపసు ఇవ్వకుండా సతాయిస్తుంటారు. అలాంటి ఓ ఘటన తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. ఓ యువ హీరో సినిమా చేస్తానని ఒప్పుకున్నాడు. అందుకు నిర్మాత అతడికి రూ.25 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. అయితే నిర్మాతకు కొన్ని ఇబ్బందుల వల్ల సినిమా నుంచి తప్పుకున్నాడు. దీంతో హీరోకు అడ్వాన్స్ వాపసు ఇవ్వమని నిర్మాత అడిగితే ఇవ్వడం లేదట. నిర్మాత సినిమా చేయకపోగా.. తన వేరే సినిమా ఆలస్యమైపోయిందని దబాయిస్తున్నాడట. అసలు విషయం ఏంటంటే.. ఓ చిన్న నిర్మాత ఓ పెద్ద బ్యానర్ అసోసియేషన్‌లో ఓ మెగా హీరోతో సినిమా చేయాలని ప్లాన్ చేశాడు.

 

అయితే తన సినిమాకు ప్రముఖ సింగ్ దేవీ శ్రీ ప్రసాద్ కావాలని, సినిమాటోగ్రాఫర్‌గా ఫలానా వ్యక్తి కావాలని ఆ యువ హీరో అడిగాడట. అందుకు నిర్మాత ఇది జరిగే పని కాదని పక్కకు తప్పుకుంది. కానీ అప్పటికే సినిమా కోసం రూ.10 లక్షలు ఖర్చు అయింది. హీరోకు అడ్వాన్స్ గా రూ.25 లక్షలు కూడా ఇచ్చేశాడు. మొదట్లో సినిమా పూర్తి చేయాలని అనుకున్న నిర్మాత.. తనకు సెట్ కావట్లేదని భావించాడు. దీంతో తన సినిమా ఆలోచనను విరమించుకున్నాడు. హీరో దగ్గరికి వెళ్లి తన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమని కోరాడట. అందుకు హీరో ససేమిరా కాదన్నాడట. పైగా ఆ నిర్మాత సినిమా చేయకపోవడం వల్ల అప్పటికే లైన్‌లో ఉన్న ఓ సినిమా షూటింగ్ లేట్ అయిందని బదులిచ్చాడట. దీంతో ఆ చిన్న నిర్మాత బాధ పడుతున్నాడు. సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే రూ.35 లక్షలు వృథాగా అయిందని ఆవేదన చెందుతున్నాడు. దీనిపై పలువురు సినీ ప్రముఖులు ఆ చిన్న మెగా హీరోపై విమర్శలు కురిపిస్తున్నారు. బోలెడు ఆస్తి ఉన్నా.. చిన్న నిర్మాతపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నాడని ఆరోపిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Andhra Pradesh: ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌ విషయంలో కుట్ర జరుగుతోందా.. ఎలక్షన్ కమిషన్ దృష్టి పెట్టాల్సిందే!

Andhra Pradesh: ప్రస్తుత ఏపీ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పాలన విధానం నచ్చకపోవడంతో ఆయనకు వ్యతిరేకంగా మారారు. ఇక తీరా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఏపీ ఉద్యోగులను వైసిపి...
- Advertisement -
- Advertisement -