Megastar Chiranjeevi: చిరంజీవిపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రముఖ నటుడు!

Megastar Chiranjeevi: ప్రస్తుతం టాలీవుడ్‌కి గాడ్ ఫాదర్‌గా కొనసాగుతున్నారు ‘మెగాస్టార్ చిరంజీవి’. ఇండస్ట్రీలో చాలా మంది మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకుని వచ్చి.. ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా మంది నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు మెగాస్టార్ చిరంజీవిని దేవుడిగా కొలుస్తుంటాయి. అలా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడే నాగ మహేశ్. సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన చిత్రం ‘రంగస్థలం’. ఈ సినిమాలో నటుడిగా నాగ మహేశ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస అవకాశాలతో ఫుల్ బిజీ అయ్యారు. ఇప్పటివరకు.. ‘రంగస్థలం, యాత్ర, జాంబి రెడ్డి, ఉప్పెన, వకీల్ సాబ్, తలైవీ, లవ్ స్టోరీ, కాలీఫ్లవర్, అఖండ, దర్జా’ వంటి సక్సెస్‌ఫుల్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు.

 

తాజాగా ఓ మీడియా ఛానెల్ ఇంటర్వ్యూకి అటెండ్ అయిన నాగ మహేశ్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. ‘మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నంబర్ 150 సినిమా చేశారు. చిరంజీవి వంటి స్టార్ హీరోతో కలిసి పని చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది. ఆ ఫీలింగ్ ఎలా ఉంది. మెగాస్టార్‌తో మీకున్న అనుబంధం ఎలాంటిది.’ అని యాంకర్.. నాగ మహేశ్‌ను ప్రశ్నించారు. దానికి నాగ మహేశ్ మాట్లాడుతూ..‘సినిమాల కంటే ముందు నుంచే మెగాస్టార్ చిరంజీవితో నాకు పరిచయం ఉంది. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తగా ఉన్నప్పుడే చిరంజీవితో మంచి బంధం ఉంది. అప్పుడు చిరంజీవిని కలిసినప్పుడు సినిమాల్లో ఛాన్స్ ఇప్పించమని అడిగాను. ఆయన కూడా మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారమే.. సినిమాల్లో పాత్రలు ఇప్పించారు. రంగస్థలం సినిమాతో నా లైఫ్‌ మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. ఇప్పుడీ పొజిషన్‌లో ఉన్నానంటే దానికి చిరంజీవే కారణం. ఆయనతో కలిసి ఖైదీ నంబర్ 150 సినిమా చేశాను. ఓ సీన్‌లో చిరంజీవి కాలర్ పట్టుకుని డైలాగ్ చెప్పాలి. ఆ సీన్ చేయడానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. నేను ఆ పాత్ర చేయనని చిరంజీవికి చెప్పాను. దానికి చిరంజీవి ఎంతో సపోర్ట్ చేశారు. ఇలాంటి వెయిట్ ఉన్న క్యారెక్టర్ మళ్లీ దొరకదు.. నువ్వు బాగా చేస్తావని భరోసా ఇచ్చారు. ఆ క్యారెక్టర్‌లో లీనం అవ్వడానికి ఎంతో శ్రమించాను.’ అని పేర్కొన్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -