Megastar Chiranjeevi: చిరంజీవి ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Megastar Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన టాలెంట్ ఏంటో నిరూపించుకొని వరుస సినిమా అవకాశాలను అందుకొని విజయపతంలో దూసుకుపోయిన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికీ ఈయన నేటి హీరోలకు దీటుగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా ఇప్పటికీ ఈయన సినిమాలు చేస్తూనే మరోవైపు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు వ్యాపార రంగంలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఉంటూనే వివిధ వ్యాపారాలు చేస్తూ భారీగా ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

ఒక వైపు సినిమాలు ఒకవైపు పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఈయన భారీగా సంపాదించి హైదరాబాద్లో పలు ప్రాంతాలలో ఖరీదైన స్థలాలు కొనుగోలు చేశారు. ఈ విధంగా చేతి కందిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈయన భారీగానే ఆస్తులు కూడా పెట్టినట్టు తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవికి కార్లంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే ఆయన గ్యారేజ్ లో ఎంతో ఖరీదైన కార్లు ఉన్నాయి. ఈ కార్ల విలువే సుమారు 150 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

ఇక హైదరాబాదులో జూబ్లీహిల్స్ తో పాటు మరి కొన్ని ఏరియాలలో కూడా ఎంతో ఖరీదైన బంగ్లాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇలా ఎన్నో ఆస్తిపాస్తులను కూడా పెట్టిన ఈయన 1500 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారని తెలుస్తుంది. ఇలా ఈ విధంగా సంపాదించిన ఈ ఆస్తిపాస్తులలో ఈయన కొంత బాగం సామాజిక సేవ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఇప్పటికే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేశారని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -