Megastar Chiranjeevi: భోళా శంకర్ ఫుటేజ్ చూసి చిరంజీవి అలా అన్నారా?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఈ మధ్య చాలా ఆలస్యంగా రిలీజ్ అవుతున్నాయనే చెప్పాలి. ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ విడుదలైంది. అయితే అంతకంటే ముందే రిలీజ్ అవుతుంది అనుకున్న భోళాశంకర్ మాత్రం విడుదల కాలేదు. అది అసలు రిలీజ్ అవుతుందా అని ఇప్పుడు చిరుకే సందేహం కలిగిందట. ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోన్న గాసిప్ ఇదే. ఈ ఏడాదిలో ఇప్పటికే చిరంజీవి నటించిన ఆచార్య, గాడ్ ఫాదర్ వంటివి వచ్చేశాయి. ఇకపోతే సంక్రాంతి పండగ కూడా వస్తోంది. ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య కూడా రానుంది.

 

అయితే ఈ సినిమాలన్నింటికంటే వస్తుందనుకున్న భోళాశంకర్ మాత్రం జాడలేకుండా పోయింది. భోళా శంకర్ అనేది రీమేక్ సినిమానే అయినా చిరంజీవి నటించడం వల్ల పెద్ద హైప్ వచ్చింది. అందులోనూ కీర్తి సురేష్ చిరుకు చెల్లెలుగా చేస్తోంది. కోలీవుడ్ లో అజిత్ హీరోగా నటించిన వేదాళం సినిమా భోళా శంకర్ గా విడుదల కానుంది. అయితే అది పెద్ద కథేం కాదు. సిస్టర్ సెంటిమెంట్ కూడా వేదాళం సినిమాలో అంతగా పండలేదనే చెప్పాలి. మరి చిరుకు మాత్రం ఆ సినిమా అచ్చు వస్తుందో రాదోనని చూడాలి.

 

గత కొన్ని రోజులుగా చిరు వరుసగా రీమేక్ సినిమాలను ఎంచుకుంటున్నారు. అసలు చిరంజీవి వేదాళం రీమేక్ కు ఎందుకు ఒప్పుకున్నారోనని ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అందులోనూ ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించడం మరో ఆందోళన కలిగిస్తోంది. మెహర్ రమేష్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. వెంకీతో షాడో, ఎన్టీఆర్ తో శక్తి సినిమాలు ఆ హీరోల కెరీర్ కే మాయని మచ్చను తెచ్చాయనే చెప్పాలి. అశ్వనీదత్ వంటి ప్రొడ్యూసర్ శక్తి సినిమా తీసి ప్లాప్ అయ్యి దాని నుంచి కోలుకునేందుకు పదేళ్లు ఇబ్బంది పడ్డారు.

 

ఈ సినిమాలో ముందుగా సిస్టర్ పాత్రకు సాయి పల్లవిని అనుకున్నారు. అయితే ఫేడవుట్ అయిన కీర్తి సురేష్ ను ఆఖరికి ఎంపిక చేశారు. ఇందులో హీరోయిన్ గా తమన్నాను అనుకున్నారు. అయితే ఇప్పటి వరకూ మెహర్ రమేష్ తీసిన అవుట్ ఫుట్ చిరుకు నచ్చలేదట. చిరంజీవి తనకు నచ్చకపోతే సినిమాను అటకెక్కిస్తారనడంలో ఏం సందేహం లేదు. ఏదేమైనా భోళా శంకర్ రిలీజ్ కోసం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -