Megastar Chiranjeevi: చిరంజీవి సినీ కెరియర్లో చేదు అనుభవాలను మిగిల్చిన సినిమాలు ఇవే?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి… వెంటనే అభిమానులు పూనకాలు మొదలవుతాయి. ఎవరి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగిన చిరంజీవి మెగాస్టార్ గా గుర్తింపు పొంది మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆయన అందం వల్ల ఎంతోమంది మెగా హీరోలు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇలా మెగా కుటుంబానికి మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దది ఎక్కువగా ఉన్న చిరంజీవి కొన్ని దశాబ్దాల కాలం నుండి 150కు పైగా సినిమాలలో నటించాడు. అయితే చిరంజీవి నటించిన ఈ సినిమాలలో అత్యధిక సినిమాలు వాటిలో కొన్ని సినిమాలు దారుణంగా పరాజయాన్ని ఎదురుకున్నాయి.

చిరంజీవి ఇప్పటివరకు నటించిన సినిమాలలో డిజాస్టర్ గా నిలిచిన సినిమాల వివరాలు చూసేద్దాం రండి.

1. అంజి : శ్యాంప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో భారీ గ్రాఫిక్స్ తో తెరకెక్కిన “అంజి” సినిమా అందరి అంచనాలను తారుమారు చేసి డిజాస్టర్ గా నిలిచింది.

2. ఆచార్య: ఇటీవల కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన “ఆచార్య” సినిమా చిరంజీవి కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది.

3. శంకర్ దాదా జిందాబాద్: బాలీవుడ్ హిట్ మూవీ ” లగే రహో మున్నాభాయ్” సినిమాని రీమేక్ గా తెలుగులో “శంకర్ దాదా జిందాబాద్” గా రూపొందించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

4 . మృగరాజు: చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మృగరాజు. “ది గోస్ట్ అండ్ ది డార్క్ నెస్” అనే హాలీవుడ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన మృగరాజు సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది.

5. సైరా నరసింహారెడ్డి: చిరంజీవి ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక డిజాస్టర్ గా మిగిలింది.

6. రిక్షావోడు: చిరంజీవి, నగ్మా జంటగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన రిక్షావోడు సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక డిజాస్టర్ గా మిగిలింది.

ఇలా చిరంజీవి నటించిన ఎస్పీ పరశురామ్, బిగ్ బాస్, జేబుదొంగ , కిరాతకుడు, ఆరాధన యుద్ధభూమి రాజా విక్రమార్క వంటి మరికొన్ని సినిమాలకు కూడా చిరంజీవి కెరీర్లో డిజాస్టర్ గా మిగిలాయి.

Related Articles

ట్రేండింగ్

Blueberries: ఇవి తింటే మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పని చేస్తుందట.. ఎలా తినాలంటే?

Blueberries: కొన్ని రకాల పండ్లు తినడం వలన అటు ఆరోగ్యానికి, ఇటు మెదడు చురుగ్గా పనిచేయడానికి కూడా ఉపయోగపడతాయి. అటువంటి వాటిలో బ్లూబెర్రీస్ ముందు వరుసలో ఉంటాయి. బ్లూ బెర్రీస్ లో ముఖ్యంగా...
- Advertisement -
- Advertisement -