Megastar Chiranjeevi టాలీవుడ్ ప్రేక్షకులకు అప్పటి స్టార్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో విలన్ పాత్రలు చేస్తూ నటుడుగా ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొంచెం కొంచెం గా తన స్థాయిని ఇండస్ట్రీకి ఒక రేంజ్ లో పరిచయం చేశాడు. ఇక నిర్మాతగా కూడా ఇండస్ట్రీలో చాలా సినిమాలు నిర్మించాడు.
ఆ విధంగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు. హైదరాబాదులో ఈరోజు తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకు చనిపోయాడు. ఈ వార్త సినీ, రాజకీయ వర్గాలు ఏమాత్రం తీసుకోలేకపోయాయి. కొన్ని అనారోగ్యాల కారణంగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కృష్ణంరాజు మృతి చెందాడు. ఈ విషయం తెలిసి కృష్ణంరాజు అభిమానులు వెంటనే తల్లడిల్లి పోయారు.
ఇక కృష్ణంరాజు మరణం గురించి పలు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ఇక ఇదే క్రమంలో కృష్ణంరాజుతో ఎంతో సన్నిహితంగా ఉండే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరొకసారి గుర్తు చేసుకున్నాడు. కృష్ణంరాజు ఇకలేరు అన్నమాట ఎంతో విషాదకరంగా అనిపిస్తుంది. ఇక ఈయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
ఇక తాజాగా చిరంజీవి కూడా ఎమోషనల్ నోట్ షేర్ చేసుకున్నాడు. అందులో చాలా విషయాలు పంచుకున్నాడు. మా ఊరి హీరో పరిశ్రమలో మొదటి నుంచి ఆప్యాయంగా ప్రోత్సహించిన కృష్ణంరాజు తో చేసిన మన వూరి పాండవులు సినిమా ఎంతో ఆత్మీయమైనది అని తెలిపాడు.
ఇక రెబల్ స్టార్ కృష్ణంరాజు అనే మాటకు నిజమైన నిర్వచనం కృష్ణంరాజు అని తెలిపాడు. కృష్ణంరాజులేని లోటు నాకు సినీ పరిశ్రమకు, తన అభిమానులకు నిజంగా తీరని లోటు అని తెలిపాడు. అనంతరం కృష్ణంరాజు ఆత్మ శాంతించాలని చిరంజీవి తెలిపాడు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో నటుడుగా ఓ వెలుగు వెలిగిన కృష్ణంరాజు చనిపోవడం నిజంగా తీసుకోలేని విధంగా మారిపోయింది.
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022