Megastar Chiranjeevi: ఆచార్య పై ట్రోల్ చేసిన వారికి రివర్స్ షాక్ ఇవ్వనున్న మెగాస్టార్ చిరంజీవి!

Megastar Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 150 సినిమాలకు పైగా నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చిరంజీవి అభిమానుల గురించి మనందరికీ తెలిసిందే. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా సినీ అవకాశాలు అందుకుంటున్నాడు.

ఇక ఇటీవల ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరంజీవి తన అభిమానులను పూర్తిగా నిరాశపరిచాడు. ఆచార్య సినిమా ఊహించని స్థాయిలో డిజాస్టర్ అయింది. ఈ క్రమంలో చిరంజీవిని నానా రకాలుగా ట్రోల్ చేశారు. చిరంజీవి క్రేజ్ తగ్గిపోయిందని, ఆచార్య సినిమాతో అంతా అయిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో తనపై వచ్చే నెగిటివ్ టాక్ బ్రేక్ చేస్తాడు అన్నట్లు తెలుస్తుంది.

ఎందుకంటే చిరంజీవి, నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ లు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమా అక్టోబర్ ఐదు న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ సాటిలైట్స్ రైట్స్ ను 110 కోట్లు అన్నట్లు తెలుస్తుంది. దీంతో మెగా యాంటీ ఫ్యాన్స్ ఒక్కసారిగా స్టన్ అవుతున్నారు. చిరంజీవి క్రేజ్ అసలు ఏమాత్రం తగ్గకపోవడం వారిని ఆశ్చర్యపరుస్తుంది.

ఇక ఓటీటీ రైట్స్ దక్కించుకోవడానికి పలు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమా కోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ 50 కోట్ల రూపాయలను పైగా ఖర్చు తమ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న గాడ్ ఫాదర్ మూవీ ఈ దసరా కానుక గా విడుదలవుతుంది. మరి ఈ సినిమాతో చిరంజీవి తన సత్తాను ఎలా చూపిస్తాడో చూడాలి. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ల నేపథ్యంలో చిరు బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Judges Trolling Case: జడ్జి హిమబిందుని అవమానించేలా పోస్టు పెట్టిన ‍వ్యక్తి అరెస్ట్‌.. ఆ వ్యక్తి ఎవరంటే?

Judges Trolling Case: చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ స్కామ్ లో భాగంగా సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ అరెస్టు అయిన విషయం మనకు తెలిసిందే. నంద్యాలలో సిఐడి అధికారులు చంద్రబాబు నాయుడుని అదుపులోకి...
- Advertisement -
- Advertisement -