Megastar Chiranjeevi: ఆచార్య డిజాస్టర్ పై స్పందించిన చిరంజీవి.. బాధ కలిగిందంటూ?

Megastar Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షకులకు మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన నటన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఇండస్ట్రీలో 150 సినిమాలకు పైగా నటించి నటనలో తనకంటూ చెరగని ముద్ర సంపాదించుకున్నారు. ప్రస్తుతం కుర్ర హీరోలతో సమానంగా చిరు వరస సినిమా అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇటీవల విడుదలైన చిరంజీవి ఆచార్య సినిమా పూర్తిగా డిజాస్టర్ అయింది.

కనుక చిరంజీవి అభిమానులు ఆశలు మొత్తం ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాపై పెట్టుకున్నారు. చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను మలయాళం లూసిఫర్ ను రీమేక్ చేస్తున్నారు. కాగా తెలుగులో గాడ్ ఫాదర్ గా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 5న థియేటర్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అనంతపురంలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభించారు.

ఆ ఈవెంట్ లో చిరు మాట్లాడుతూ నేనెప్పుడూ సీమకు వచ్చినా నేలతడుస్తుంది. ఇంద్ర సినిమా షూటింగ్ విషయంలో వచ్చినప్పుడు కూడా వరుణ దేవుడిని ప్రార్థించాను ఇప్పుడు కూడా వర్షం కురిసింది. పొలిటికల్ గా పులివెందులలో అడుగుపెట్టినప్పుడు అప్పుడు కూడా వర్షం కురిసింది. కాబట్టి నాకు ఇది ఎంతో సుభ సూచికంగా అనిపిస్తుంది అని చిరంజీవి ఈ విషయాన్ని బయట పెట్టాడు. ఇక జయ అవజయాలు సాధారణమే కానీ.. ప్రేక్షకులను అలరించ లేకపోయాననే బాధ ఇటీవల కలిగింది. ఇటీవల ఆయన నటించిన ఆచార్య డిజాస్టర్ కావడంతో ఈ విధంగా స్పందించాడు.

దానికి సమాధానమే ఈ గాడ్ ఫాదర్ అని చిరంజీవి ఎంతో కాన్ఫిడెంట్ గా తన గాడ్ ఫాదర్ మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు. నిజానికి ఆచార్య సినిమాతో చిరంజీవి కొన్ని రకాల ట్రోల్స్ కు గురయ్యారు. అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో చాలా నిరాశ పడ్డారు. కానీ దసరాకి విడుదలయ్యే గాడ్ ఫాదర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా గాడ్ ఫాదర్ సినిమాను చిరంజీవి అభిమానులు ఛాలెంజ్ గా తీసుకున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -