Megastar Chiranjeevi: టాలీవుడ్ ప్రేక్షక ప్రపంచానికి మెగాస్టార్ చిరంజీవి పేరు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్టార్ హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కుర్ర హీరోలతో సమానంగా సినిమా అవకాశాలు అనుకుంటూ ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు. త్వరలో మలయాళం రీమేక్ గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే మనం ఇప్పుడు చిరు ఇదివరకు రీమేక్ చేసిన సినిమాల జాబితా తెలుసుకుందాం.
ఇది కథ కాదు: ఈ సినిమా 1979లో తమిళంలో బాలచందర్రావు గారు దర్శకత్వం వహించిన అవర్ గల్ అనే సినిమాకు రీమేక్. ఇందులో చిరంజీవి ప్రధాన పాత్ర పోషించలేదు. కానీ చెప్పుకోదగ్గ పాత్రలో పోషించాడు.
పున్నమినాగు: ఇది కన్నడ మూవీ.. పున్నిమయ రాత్రి యల్లీ మూవీకి రీమేక్. 1980లో విడుదలైన ఈ సినిమా చిరంజీవికి నటుడుగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించి పెట్టింది.
ప్రేమ తరంగాలు: ఇందులో చిరంజీవి ప్రధాన పాత్రలో పోషించలేదు. ఇది హిందీలో ముఖదర్కర్ క సికిందర్ కి రీమేక్. ఈ సినిమా అప్పటి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
మొగుడు కావాలి: 1980లో విడుదలైన ఈ సినిమా హిందీలో మంచాలి సినిమాకు రీమేక్. ఈ సినిమా బాలీవుడ్ లో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకుంది.
చట్టానికి కళ్ళు లేవు: 1981లో విడుదలైన ఈ సినిమా చట్టం వరు ఇరుతరై అనే తమిళ్ సినిమాకు రీమేక్. ఈ సినిమా అప్పట్లో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అందుకని ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేశారు.
మంచు పల్లకి : 1982లో విడుదలైన మంచు పల్లకి సినిమా పాలై వన చోలై అనే తమిళ సినిమాను రీమేక్ చేశారు. ఈ సినిమా అప్పట్లో తమిళంలో బాగా గుర్తింపు సంపాదించ్చుకుంది. అందుకే తెలుగులో రీమేక్ చేశారు.
ఇలా టాలీవుడ్ లో చిరంజీవి పలు సినిమాలను రీమేక్ చేశారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న గాడ్ ఫాదర్ సినిమా కూడా మలయాళం లో భారీ స్థాయిలో సక్సెస్ అయిన లూసిఫర్ సినిమాను రీమేక్ గా చేస్తున్నారు.