Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సంచలన నిర్ణయం.. ఏమైందంటే?

Megastar Chiranjeevi: మెగా వారసుడి కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్, ఉపాసనలు తల్లిదండ్రులు కాబోతున్నారని అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చినప్పటి నుంచి మెగా వారసుడి గురించి సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మెగా కోడలు ఉపాసన తల్లి కాబోతోందన్న వార్త తెలిసి మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ కు కొడుకు పుడతాడా? లేకుండా కూతురు పుడుతుందా అని మరికొందరు అయితే సోషల్ మీడియాలో పోల్స్ కూడా నిర్వహించడం మొదలెట్టేశారు.

 

 

ఈ నేపథ్యంలో మెగా కుటుంబంలో ఆస్తి గొడవలు కూడా మొదలయ్యాయని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవికి ఒక కొడుకు రామ్ చరణ్, ఇద్దరు కూతుర్లు శ్రీజ, సుస్మితలు ఉన్నారు. ఇప్పటికే మెగాస్టార్ కూతుర్లకు పెట్టాల్సినంత పెట్టేశారు. అయితే ఇకపై తాను సంపాదించే ఆస్తి మాత్రం తన రామ్ చరణ్ కొడుక్కి చెందేలా చిరంజీవి వీలునామా రాసినట్లు సమాచారం. ఆ విషయం తెలుసుకున్న మెగా డాటర్స్ ఫైర్ అవుతున్నట్లుగా తెలుస్తోంది.

 

రామ్ చరణ్ కు ఇప్పటికే కోట్ల ఆస్తి ఉంది. అలాగే తన భార్య ఉపాసనకు ఇంకా ఎక్కువగానే ఆస్తి ఉంది. ఇప్పుడు పుట్టబోయే వారసుడికి మెగా ఫ్యామిలీ నుంచి అటు కామినేని ఫ్యామిలీ నుంచి కూడా కోట్ల ఆస్తి వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ క్రమంలో చిరంజీవి తన పేరు మీదున్న ఆస్తి మొత్తం మెగా వారసుడి పేరు పై రాసేలా చేయడం మెగా ఫ్యామిలీలో అలజడి కలిగిస్తోందని సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

 

అయితే ఈ వార్తల్లో నిజం ఉందో లేదోనని చాలా మందికి తెలియదు. ఈ వార్తను కొందరు ఆకతాయిలు కావాలనే పుట్టించారని తెలుస్తోంది. ఏదేమైనా ఈ వార్తలపై మెగాస్టార్ చిరంజీవి నోరు విప్పి మాట్లాడే సమయం త్వరలోనే రానుందని తెలుస్తోంది. అప్పటి వరకూ మెగా ఫ్యాన్స్ ఎదురుచూడక తప్పదు.

Related Articles

ట్రేండింగ్

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధానమైన కారణాలివే.. ఆ తప్పులే ముంచేశాయా?

తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని సొంతం చేసుకుంటామని కాన్ఫిడెన్స్ తో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఈ పార్టీకి 2023 ఫలితాలు మాత్రం...
- Advertisement -
- Advertisement -