Megastar Chiranjeevi: చరణ్ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న చిరంజీవి.. అన్ని రూ.కోట్లా?

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే రీ ఎంట్రీ తర్వాత ఈయన చేసిన సినిమాలు ప్రేక్షకులు అంచనాలను చేరుకోలేకపోతున్నాయి.ఇక సైరా నరసింహారెడ్డి ఖైదీ నెంబర్ 150 పరవాలేదు అనిపించిన ఆచార్య మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఆచార్య వంటి ఒక డిజాస్టర్ సినిమా తర్వాతమెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

విజయదశమి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా కోసం మెగాస్టార్ భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం.ఈ సినిమా నిర్మాణంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ లతో పాటు రామ్ చరణ్ కూడా భాగస్వామ్యమైన విషయం మనకు తెలిసిందే.

ఈ విధంగా రాంచరణ్ నిర్మాత అయినప్పటికీ రెమ్యూనరేషన్ విషయంలో వీరిద్దరూ ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం చిరంజీవి రామ్ చరణ్ కి ఏమాత్రం తగ్గకుండా రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. గాడ్ ఫాదర్ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి 50 కోట్లు తీసుకున్నారని అలాగే ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ గా నటించిన సల్మాన్ ఖాన్ కోసం ఐదు కోట్ల రూపాయలు ముందుగానే అలాట్ చేశారని తెలుస్తోంది.

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఏ విధమైనటువంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ పై ఉన్న అభిమానంతోనే ఆయన ఫ్రీగా నటించారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఆయనకు రెమ్యూనరేషన్ రూపంలో కాకుండా ఏదైనా గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని ముందుగా అతనికి ఐదు కోట్ల రూపాయలు అలర్ట్ చేసినట్టు తెలుస్తుంది.అయితే ఇదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి కూడా వెల్లడించిన విషయం మనకు తెలిసిందే. త్వరలోనే రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వబోతున్నారనే వార్త మాత్రం వైరల్ అవుతుంది. ప్రస్తుతం చిరంజీవి 50 కోట్ల రెమ్యూనరేషన్ అంటే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -