Divi Vedthya: బిగ్ బాస్ బ్యూటీకి మాటిచ్చిన మెగాస్టార్.. కల నెరవేరిందోచ్..

Divi Vedthya: మెగాస్టార్ చిరంజీవి సింప్లిసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్లర్లేదు. తన సినిమాలో నటీనటులు మొదలుకొని లైట్ బోయ్ వరకు.. అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఆయన ఎవరికైనా మాట ఇస్తే ఇట్టే నెరవేరుస్తారనే ప్రచారం ఉంది. అది ఇప్పటికే చాలాసార్లు నిరూపితమైంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈ విషయం ఓ బ్యూటీ స్వయంగా చెప్పింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలై మంచి ఆదరణ పొందింది. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, ఇంతకు ముందు మెగాస్టార్ బిగ్ బాస్ లో పాల్గొన్న నటి దివి కి ఓ మాటిచ్చారట. అదేంటంటే.. తన సినిమాలో అవకాశం ఇస్తానని. మాట ఇచ్చినట్లుగానే ఆమెకు గాడ్ ఫాదర్ సినిమాలో ఛాన్సిచ్చారట మెగాస్టార్.

ఈ విషయాన్ని దివి స్వయంగా వెల్లడించింది. ఊటీలో షూట్ చేసిన సన్నివేశంలో చిరంజీవితో కలిసి నటించే అవకాశం దక్కిందని ఈ అమ్మడు ఉబ్బి తబ్బిబ్బవుతోంది. పాత్ర చిన్నదే అయినా మెగాస్టార్ కళ్లలోకి కళ్లుపెట్టి చూసే అవకాశం దక్కిందని సంబరపడింది. చిరంజీవి దగ్గరుండి సీన్ షూట్ చేయించారని తెలిపింది.

బిగ్ బాస్ షోతో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న నటి దివి.. ఏకంగా మెగాస్టార్ పక్కన చిన్న సీన్ లో అయినా నటించే చాన్స్ రావడం ఆమె అదృష్టం తలుపు తట్టినట్లయ్యిందని చెబుతున్నారు. వెండితెరపై ఇంకా మంచి పాత్రలు చేసే అవకాశం దక్కుతుందని ఈ ముద్దుగుమ్మ దివి ఆశపడుతోంది.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -