Mehar Ramesh: ఆ విషయంలో అశ్వినిదత్ నా మాట వినలేదు.. అందుకే శక్తి సినిమా ప్లాప్!

Mehar Ramesh: సినీ ఇండస్ట్రీలో సినిమాలు రిలీజ్ అవ్వడం.. ప్లాప్ అవ్వడం కామన్. అయితే కొన్ని సినిమాలు రిలీజ్‌కు ముందే ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేస్తుంటాయి. భారీ అంచనాలతో థియేటర్ల ముందుకు వచ్చి.. ప్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఒక సినిమాలో ‘శక్తి’ కూడా ఒకటి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఇలియానా హీరోయిన్‌గా నటించిన చిత్రం శక్తి. ఈ సినిమాను డైరెక్టర్ మెహర్ రమేశ్ దర్శకత్వం వహించగా.. ప్రొడ్యూసర్ అశ్వినిదత్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా.. ఎన్టీఆర్ కెరీర్‌లో డిజాస్టర్ మూవీగా నమోదు చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ మెహర్ రమేశ్ ‘శక్తి’ సినిమాపై ఓ యూట్యూబ్ ఛానెల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇందులో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

దర్శకుడు మెహర్ రమేశ్ ఇప్పిటివరకు కొన్ని సినిమాలు మాత్రమే చేశారు. అయినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. ఎన్టీఆర్‌తో కలిసి ‘కంత్రి’ సినిమా తీశారు. ఈ సినిమాతోనే డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘బిల్లా’, విక్టరీ వెంకటేశ్‌తో ‘షాడో’ సినిమాలు చేశాడు. ఈ సినిమాలు పెద్దగా రాణించలేదు. ఎన్టీఆర్‌తో కలిసి ‘శక్తి’ సినిమా కూడా తీశారు. ఈ సినిమా భారీ అంచనాలతోనే రిలీజ్ అయింది. కానీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్‌కు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని డైరెక్టర్ మెహర్ రమేశ్ చెప్పుకొచ్చారు.

ఇంటర్వ్యూలో డైరెక్టర్ మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. ‘శక్తి సినిమా కోసం చాలా దేశాలు తిరిగాం. బడ్జెట్ పరంగా నిర్మాత అశ్వినిదత్‌కు మంచి లాభాలు సమకూర్చింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా.. మనీపరంగా ఈ సినిమా వర్కౌట్ అయింది. అయితే నేను అశ్వినిదత్‌కు చెప్పిన కథ ఒకటైతే.. తీసిన కథ ఒకటి. నిర్మాతకు నేను కథ చెప్పగానే.. ఆయన నాకు కొంత మంది రైటర్స్ ను ఇచ్చారు. ఇందులో గంధం నాగరాజు, యండమూరి వీరేంద్రనాథ్ వంటి ప్రముఖ రచయితలు ఉన్నారు. అయితే ఈ కథలో డివోషనల్‌ను జోడించడం పెద్ద మైనస్ అయినట్లు అనిపించింది. షూటింగ్ సమయంలోనే నిర్మాతకు చెప్పాను.. స్టోరీ నాకు అర్థం కావట్లేదని, సినిమా ఆడదని చెప్పాను. అయినా నా మాట వినలేదు.’ అని మెహర్ రమేశ్ చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -