Viral: వైరల్ అవుతున్న మేకపాటి సంచలన వ్యాఖ్యలు!

Viral: ఇన్ని రోజులపాటు వైసీపీ పార్టీలో కొనసాగుతూ స్థానిక ప్రాంతాలలో చక్రం తిప్పినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా క్రాస్ ఓటింగ్ వేశారని ఆరోపణలను ఎదుర్కోవడంతో వైఎస్ఆర్సిపి పార్టీ ఈయనపై సస్పెన్షన్ వేటు వేసింది. అయితే ఈయనని సస్పెండ్ చేయడంతో ఇన్ని రోజులపాటు ఆయనపై కత్తులు దూయలేక ఇబ్బంది పడిన నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఒక్కసారిగా మేకపాటి పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ తల్లి లాంటి వైసిపి పార్టీని జగనన్నను ద్రోహం చేసినటువంటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఇంకొకసారి ఉదయగిరిలో కాలు పెడితే తరిమి తరిమి కొట్టండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై మేకపాటి స్పందిస్తూ గురువారం ఉదయం తన అనుచరులతో కలిసి ఉదయగిరి బస్టాండుకు చేరుకొని అక్కడ కూర్చున్న మేకపాటి అనిల్ కుమార్ యాదవ్ కి సవాల్ విసిరారు.

 

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ నువ్వేదో పెద్ద పోటుగాడివి అనుకుంటున్నావు. ఉదయగిరి కి వచ్చాను నీకు దమ్ముంటే రా నేను ఇక్కడే ఉంటాను అంటూ సవాల్ విసిరారు.ఇలా ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న మీరందరూ కూడా ఒకప్పుడు నా కాళ్ళ దగ్గర బ్రతికిన వారేనని గుర్తుపెట్టుకోండి అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.ఇక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు నా గురించి తప్పుగా మాట్లాడితే నాకన్నా ముందే జనాలు తరిమి తరిమి కొడతారు అంటూ ఈయన తెలిపారు.

 

వచ్చే ఎన్నికలలో నేను గెలవనని చెబుతున్నావు గత ఎన్నికలలో నేను 60 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను నువ్వెన్ని ఓట్లతో గెలిచావు కేవలం సింగిల్ డిజిట్ ఓట్ల మెజారిటీతో గెలిచావని గుర్తు చేశారు. గత ఎన్నికలలో మా అందరి అండదండలతో గెలిచిన నువ్వు వచ్చే ఎన్నికలలో అడ్రస్ లేకుండా పోతావు. అసలు వచ్చే ఎన్నికలలో నీకు మీ జగనన్న టికెట్ ఇస్తారో లేదో ముందు తెలుసుకో అంటూ మేకపాటి అనిల్ కు సవాల్ విసిరారు.వచ్చే ఎన్నికలలో నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమే మరి నేను గెలిస్తే నువ్వు తప్పకుంటావా అని ప్రశ్నించారు. ఇలా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -