Dil Raju: దిల్ రాజు మాస్టర్ ప్లాన్‌కు మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!

Dil Raju: తెలుగు సినిమాలకు సంక్రాంతి చాలా పెద్ద సీజన్. తమిళ చిత్రాలకు కూడా పొంగల్ బడా సీజనే. ఈ పండక్కి తమ సినిమాలను రేసులో నిలిపేందుకు ఈ రెండు ఇండస్ట్రీల దర్శక నిర్మాతలు పోటీపడుతుంటారు. పండుగ సెలవులను సరిగ్గా వాడుకుంటే, సినిమాలకు కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు ఓ రేంజ్ లో దండుకోవచ్చనేది అందరి ప్లాన్. అందుకే ప్రతి ఏడాది ఈ సీజన్ లో ఏకంగా నాలుగైదు సినిమాలు బరిలోకి దిగుతాయి.

 

తెలుగులో సంక్రాంతి పండక్కి నాలుగైదు సినిమాలు రిలీజవ్వడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. పెద్ద చిత్రాలు బరిలో ఉన్నా వాటికి ఏమాత్రం జంకకుండా చిన్న మూవీస్ కూడా రేసులో నిలుస్తాయి. అలా నిలిచి సక్సెస్ అయినవి కూడా ఎన్నో ఉన్నాయి. వచ్చే ఏడాది (2023) సంక్రాంతి రేసు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ పండక్కి కూడా దాదాపుగా ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి.

 

పెద్ద సినిమాల మధ్య ఓ చిన్న చిత్రం!
టాలీవుడ్ లో చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతికి రిలీజ్ కానున్నాయి. వీటితోపాటు కోలీవుడ్ హీరోలు విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తెగింపు’తో పండక్కి వచ్చేస్తున్నారు. వీటితోపాటు యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘కల్యాణం కమనీయం’ కూడా బరిలోకి దిగుతోంది. దీంతో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.

 

బాలయ్య, చిరు తెలుగు హీరోలు కాబట్టి వారికి ఎక్కువ థియేటర్లు దక్కాలనేది మైత్రీ మూవీ మేకర్స్ వాదనలా కనిపిస్తోంది. విజయ్ ‘వారసుడు’కు నిర్మాత అయిన దిల్ రాజుకు తన మూవీకి మ్యాగ్జిమమ్ థియేటర్స్ దక్కేలా చూసుకుంటున్నారని వినికిడి. దీని వల్ల బాలయ్య, చిరు మూవీస్ కు ఎక్కువ థియేటర్స్ దొరికే చాన్స్ కష్టమేనని చెప్పొచ్చు. అలాంటప్పుడు వాళ్లిద్దరి సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా.. రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం కుదరదని ట్రేడ్ చెబుతోంది. దిల్ రాజు ప్లాన్ కూడా ఇదేనని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -