Land Titling Act: ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోనే ఉందా.. అమలు చేస్తున్నా అబద్దాలు అందుకే చెబుతోందా?

Land Titling Act: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశం అధికార పార్టీ నేతలకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ఎన్నికలు మరొక రెండు వారాలలో జరగబోతున్నాయనే విషయం తెలిసిందే .ఈ తరుణంలోనే ల్యాండ్ టైటిలింగ్ అంశం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణమైనదని చెప్పాలి. ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలులో ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఈ ల్యాండ్ టైటిలింగ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల సొమ్మును కాజేసేందుకు ప్రభుత్వాలకు కుట్ర పడుతున్నాయని తెలుపుతుంది.

ఇలా ప్రభుత్వ పట్ల ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఈ విమర్శలను అధికార ప్రభుత్వ నేతలు తిప్పి కొడుతున్నారు.ల్యాండ్ టైటిలింగ్ అనేది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో అమలు లేదని తెలుపుతున్నారు. ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఈ విషయం గురించి ప్రెస్మీట్లో పెట్టి మరీ చెబుతున్నారు. మరి ఆంధ్రలో ఇంకా ఈ చట్టం అమలులోకి రాకపోతే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి భూ సురక్ష అంటూ సర్వేలు చేయించి మరి కొత్త పాస్ ఋక్కులను విడుదల చేశారు.

ఈ పాసు బుక్కులపై స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండటమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలులో తెలపడానికి మంచి ఉదాహరణ అంటూ ప్రతిపక్షాలు తెలుపుతున్నాయి.ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలు ఎలా మంచిదో చెప్పడం లేదు. వివాదాలు పరిష్కరించాలని అనుకుంటారు కానీ ఆ పేరుతో వైసీపీ నేతలు తమ భూమూల్ని కబ్జాలు చేయాలని ఏ రైతు కోరుకోడు. కానీ ఇక్కడ తమ భూములకు వివాదాల్లోకి నెట్టి వాటిని తమ పేర రాయించుకుని న్యాయపరంగా పోరాడే పరిస్థితి లేదని ప్రతి ఒక్కరికి అర్థం అయింది.

ఇలా ల్యాండ్ టైటిలింగ్ ద్వారా భూములను కొట్టేసిన కూడా అడిగే హక్కు రైతులకు భూ యజమానికి లేదు కోర్టులో కూడా ఈ సమస్యకు న్యాయ పరిష్కారం కాదు ఇలాంటి తరుణంలో ఇకపై ఏపీలో భూములు కొనుక్కోవాలి అన్న ఉన్న భూములను కాపాడుకోవాలి అన్న కూడా ఎంతో కష్టమైన పని అని తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారి కూటమికి మద్దతు తెలపడానికి సిద్ధమవుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -