KTR: వైరల్ అవుతున్న మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

KTR: తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి ప్లీనరీ, పార్టీ ఆవిర్భావ సభకి తెలంగాణ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి, అమరవీరుల స్థూపానికి కేటీఆర్ నివాళులు అర్పించారు. ఈ సభకి బీఅర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం నాయకత్వంలో పని చేయడం పూర్వజన్మ సుకృతం, సీఎం కేసీఆర్ గురించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఎంతో గొప్పగా చెప్పారు అంటూ ఆ మాటలను గుర్తు చేశారు కేటీఆర్. ఒకప్పుడు ఎట్లా ఉన్నా సిరిసిల్ల నేడు ఎలా అయిపోయింది.

రాష్ట్రం కేంద్రం బాగుపడాలి అంటే ఎవరి పని వారు చేయాలి అని ఆయన తెలిపారు. అంతేకాకుండా బీఆర్ఎస్ పేరు మాత్రమే మారిందని డిఎన్ఏ మారలేదు అని ఆయన తెలిపారు. 2010 నుండి 2014 వరకు గుజరాత్ లో జరగని అభివృద్ధి జరిగిందని చెప్పి నరేంద్రమోదీ పీఎం అయ్యారని చెప్పారు. మహారాష్ట్రలో రైతులు కెసిఆర్ వెంట ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా 2014 లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ రైతులను పట్టించుకోలేదంటూ ఆయన విమర్శించారు. కేవలం చారిత్రక అనివార్యత కోసం మాత్రమే సీఎం కేసీఆర్ జాతీయ నాయకత్వంలోకి వెళ్ళారని.. కాంగ్రెస్, బీజేపీని తప్పకుండా ప్రజలు బండకేసి కొడతారని స్పష్టం చేశారు కేటీఆర్.

 

కేసీఆర్ కాలి గోటికి సరిపోయే నాయకుడు ఎవరు లేరని, బ్రెయిన్ లేని బంటి, పార్టీలు మారే వారితో కేసీఅర్ పోటీపడలా అని ఆయన అన్నారు. అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వారు కేసిఆర్ పాలనలో సంతోషంగా ఉన్నారని ఒకసారి గుర్తు చేశారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల అందరూ సంతోషంగా ఉన్నారని ఆయన వెల్లడించారు. అలాగే తనను ప్రజలు దయతో 89 వేళ ఓట్ల మెజార్టీతో గెలిపించారని కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడి పోయామని తెలిపారు. మతం పేరు మీద విచిత్ర ఎంపీని తెచ్చుకున్నామని, ఆదమర్చి కూడా ఉండకూడదని ఎప్పటికప్పుడు అలెర్ట్ గా ఉండాలని ఆయన తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ సీటును ఈసారి వదులుకునే పరిస్థితి లేదని ఎలా అయిన సిరిసిల్ల మెజార్టీతో గెలవాలని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -