Ponniyin Selvan: తమిళ బాహుబలి పొన్నియన్ సెల్వన్ టాక్ ఇదే.. అదే మైనస్ అంటూ?

Ponniyin Selvan: తెలుగు సినీప్రియులకు తమిళ బాహుబలి గా పేరు తెచ్చుకున్న పొన్నియన్ సెల్వన్ సినిమా గురించి మనందరికీ తెలిసిందే. కాగా సినిమాకు హీరో విక్రం, త్రిష, కార్తీ, పలువురు స్టార్లు ప్రధాన పాత్రలు పోషించారు. దీంతో ఈ సినిమా ఆరంభం నుంచి తమిళంలో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమాకు విడుదలైన టీజర్లు ఫస్ట్ లుక్ లకు మూవీ పరంగా వరల్డ్ వైడ్ గా మంచి బజ్ ఏర్పడింది.

ఈ సినిమాకి తమిళంలో దాదాపు 65 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల బిజినెస్ అయినట్లు తెలుస్తుంది. ఇలా మొత్తం గా 130 కోట్ల వరకు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. హాలీవుడ్ స్టార్స్ నటించిన ఈ సినిమా పిరియాడిక్ అండ్ యాక్టన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో షో లు కూడా ప్రదర్శితం అవుతున్నాయి.

ఇక స్టార్టింగ్ లోనే ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చింది. ఈ సినిమా బాగుందని కొందరు, యావరేజ్ అని మరి కొందరు ట్వీట్లు చేస్తున్నారు. ఇక మూవీ ఓవరాల్ గా చూసుకుంటే మొదటి భాగం మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్‌లతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయేలా అనిపించిందట. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ ఒక రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సెకండాఫ్ మాత్రం కొంత నిరాశపరిచిందని తెలుస్తుంది.

కానీ క్లైమాక్స్ మాత్రం మరో స్థాయిలో ఉందని సినిమా చూసిన వాళ్ళు చెబుతున్నారు. కానీ సినిమా విడుదలకు ముందు తమిళ ప్రేక్షకులు ఈ సినిమా బాహుబలిని తొక్కి పడేసేలా ఉంటుంది అన్నట్లు మాట్లాడారు. దీనికి తెలుగు ప్రేక్షకులు కోట్లుకొల్లగొట్టిన బాహుబలికి మీ తమిళ్ సినిమాకి ఏమైనా సంబంధం ఉందా అని కౌంటర్ ఇచ్చారు. మరి కలెక్షన్ల విషయాలను ఈ సినిమా బాహుబలిని క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -