Hair Loss: దాన్ని నూనెలో కలిపి జుట్టుకు రాస్తే ఎంతో నిగారింపు!

Hair Loss: ప్రస్తుత కాలంలో స్త్రీలు, పురుషులు చిన్న పెద్దా తేడా లేకుండా ఎదుర్కోంటున్న సమస్య జుట్టు రాలడం. శరీరంలో హార్మోన్స్‌ సమస్యతో పాటు సరైన పోషకాహరం తీసుకోకపోవడంతో జుట్టు రాలడం, సన్నగా మారడం, కుదుళ్ల చివరన చిట్లిపోవడం జరుగుతుంటుంది. ఈ సమస్యను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తుంటారు. వివిధ రకాల రసాయనాలు ప్రొడక్ట్‌ను వాడి మరిన్ని జుట్టు సమస్యలతోపాటు చర్మ సమస్యలు ఎదుర్కోనే అవకాశం కూడా ఉంది. అయితే మన ఇంట్లోని వంటశాలలో ఉండే కొన్ని పదార్థాలు జుట్టు సమస్యలను తగ్గించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నల్ల జీలకర్ర. ఇది జుట్టు సమస్యలను తగ్గించడంలో ఎంతగానో సహయపడుతుంది.

నల్ల జీలకర్ర నూనె జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా.. బలంగా.. మరింత పొడవుగా పెరిగెందుకు సహాయపడుతుంది. ఇందులో థైమోక్వినోన్‌ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది యాంటిహిస్టామైన్‌. ఇది జుట్టు తిరిగి పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్‌–సీ వంటి ఇతర పోషకాలు కూడా జుట్టుకు బాగా పనిచేస్తాయి. ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్‌ లక్షణాలు ఉన్నాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఉపయోగించే విధానం ఇలా..

1. నల్లజీలకర్రను కొంచెం కొబ్బరి నూనెలో కలిపి వారం రోజులుగా రాసుకుంటే ఇలా కొన్ని జుట్టు రాలడం ఆగిపోతుంది. నల్ల జీలకర్ర నూనె, కాస్టర్‌ ఆయిల్‌ సమాన మొత్తంలో తీసుకోని రాత్రి పూట తలపై మసాజ్‌ చేయాలి. ఉదయాన్నే షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

2. 2 టేబుల్‌ సూన్‌ల నల్ల జీలకర్ర నూనెను తలపై అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును శుభ్రం చేయాలి. ఇలా వారానికి 2–3 సార్లు చేయడం జుట్టు పెరుగుతుంది.

3. ఒక గిన్నెలో 1 టేబుల్‌ స్పూన్‌ నల్ల జీలకర్ర, 1 టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌ కలిపి తలకు అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత షాంపూతో తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2–3 సార్లు చేయడం వలన జుట్టు మృదువుగా మారుతుంది.

4. ఒక టీ స్పూన్‌ నిమ్మరసం, 2 టేబుల్‌ స్పూన్ల నల్లజీలకర్ర నూనెను కలిపి తలకు అప్లై చేసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి 2–3 సార్లు చేయడం వలన జుట్టు రాలడం ఆగిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -