MLA Seetakka: ఎమ్మెల్యే సీతక్క అరుదైన ఘనత.. పీహెచ్డీ అందుకున్న ఎమ్మెల్యే

MLA Seetakka: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీతక్క అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ములుగు ఎమ్మెల్యే ఉన్న ఆమె.. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా లాక్ డౌన్ సమయంలో పేద ప్రజలను ఆదుకున్నారు. పేదలకు అవసరమైతే నిత్యావసర సరుకులు అందించారు. రోడ్లు సరిగ్గా లేని ప్రాంతాలు, అడవుల్లో నివసించే ప్రజలను కూడా కలుసుకుని సహయం చేశారు.

అయితే ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూనే ఇప్పటికీ కూడా సీతక్క చదువును కొనసాగిస్తున్నారు. లా చదవి లాయర్ గా పనిచేసిన సీతక్క తాజగా పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ విషయాన్ని సీతక్క తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తిరుపతిరావు గైడ్ గా తాను పీహెచ్ డీ పూర్తి చేసినట్లు తెలిపారు. పీహెచ్డీ పూర్తి చేయడంలో సహకరించి ప్రస్తుతత మణిపూర్ యూనివర్సిటీ ఛానల్సలర్ హెచ్ఓడీ ప్రొఫెసర్ ముసలయ్య, ప్రొపెసర్ అశోక్ నాయుడులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

పొలిటిక్ సైన్స్ లో (సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ డిప్రివేషన్ ఆఫ్ మైగ్రెంట్ ట్రైబల్స్ ఆఫ్ ఎరస్టవైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ – ఎ కేస్ స్టడీ ఆఫ్ గొట్టి కోయ ట్రైబ్స్ ఇన్ వరంగల్ ఖమ్మం డిస్ట్రిక్ట్స్) అనే టాపిక్ పై పీహెచ్డీ చేసినట్లు తెలిపారు. గిరిజనుల వెనుకబాటుపై పరిశోధన చేసి పీహెచ్డీ సాధించినట్లు సీతక్క తెలిపారు. ఈ విషయాన్ని సీతక్క ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాను మావోయిస్టు పార్టీలోకి చేరి ఆడవుల్లోకి వెళతానని. లాయర్ అవుతానని, ఎమ్మెల్యే అవుతానని ఇప్పుడు పీహెచ్డీ చేస్తానని ఎప్పుడూ అనుకోలేది ఈ సందర్భంగా సీతక్క తెలిపారు.

ఇప్పటి నుంచి తను రాజకీయ శాస్త్రంలో డాక్టర్ అనసూయ సీతక్క పీహెచ్డీ అని పిలవవచ్చని సీతక్క తెలిపారు. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ తరపున సీతక్క ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ గెలుపు కోసం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మునుగోడులోనే ఉండి ప్రచారం చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -