Amarinder Singh: కాషాయదళంలోకి మాజీ సీఎం జంప్.. కేజ్రీవాల్ కు చెక్ పెట్టే దిశగా మోదీ-షా

Amarinder Singh: ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమత్ షా చేతుల్లోకి బీజేపీ వెళ్లిన తర్వాత పూర్తిగా అధికారమే పరమావధిగా ఆ పార్టీ పనిచేస్తుంది. పార్టీ సిద్దాంతాలు, విలువలు బీజేపీలో లేకుండా పోయాయి. కేవలం అధికారమే లక్ష్యంగా మోదీ-షా పావులు కదుపుతున్నారు, దేశం మొత్తాన్ని కాషాయమయం చేయాలన్నదే మోదీ-షాల లక్ష్యం. దాని కోసం ఎన్ని కుయుక్తులు, కుట్రలైనా పన్నుతారనేది చాలా రాష్ట్రాల్లో బీజేపీ విషయంలో నిరూపితమైంది. ఎంత బలమైన పార్టీ అయినా సరే నాయనో.. భయానో బెదిరించి అధికారాన్ని తమ సొంతం చేసుకుంటున్నారు.

ఇక ఇటీవల ఢిల్లీ, పంజాబ్ లో కేజ్రీవాల్ ప్రభుత్వాలను పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ తమ ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు కోట్ల రూపాయలు ఆఫర్ చేస్తుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంను తెరపకి తెచ్చి డిప్యూటీ సీఎం మనీష్ సోసిడియాను తమవైపుకు తిప్పుకుని ఆప్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని బీజేపీ ప్రయత్నాలు చేసింది. కానీ మనీష్ సిసోడియా కేజ్రీవాల్ కు అత్యంత నమ్మకస్తుడు. ఆయన దిగిరాకపోవంతో బీజేపీ పాలిచకలు ఫలించలేదు.

ఈ విషయాన్ని ముందు పసిగొట్టిన కేజ్రీవాల్.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించి ప్రభుత్వ బలాన్ని నిరూపించారు. దీంతో ఢిల్లీలో పాచికలు పారకపోవడంతో పంజాబ్ పై బీజేపీ ఆపరేషన్ లోటస్ ప్రారంభించింది. అక్కడ ఆప్ ఎమ్మెల్యేలను తీసుునేందుకుక ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇలాంటి తరుణంలో బీజేపీ మరో వ్యూహానికి తెరలేపింది. పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్ ను తమవైపుకు తిప్పుకుని సక్సెస్ కొట్టింది. గత పంజాబ్ ఎన్నికలకు ముందే ఆయనను సీఎంగా కాంగ్రెస్ అధినాయకత్వం తప్పించింది. దీంతో కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు.

పంజాబ్ లో లోక్ కాంగ్రెస్ పార్టీని అమరీంద్ సింగ్ స్థాపించారు. కానీ గత ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఏకంగా మాజీ సీఎం అమరీందర్ సింగ్ నే డిపాజిట్లు కోల్పోయారు. ఆ తర్వాత రాజకీయంగా సైలెంట్ గా ఆయనపై బీజేపీ కన్నేసింది. బీజేపీ ఆహ్వానంతో కాషాయ పార్టీలో చేరేందుకు అమరీంద్ సింగ్ సిద్దమ్యారు. ఈ నెల 19న జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ గూటికి చేరుకోనున్నారు. తన పార్టీని ఆయన బీజేపీలో విలీనం చేయనున్నారు.

అయితే అమరీందర్ సింగ్ ను బీజేపీలో చేర్చుకోవడం వెనుక భారీ ప్లాన్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పంజాబ్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆప్ గద్దె దించి అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్ పరిస్ధితి ఆశాజనకంగా ఉంది. దీంతో కాంగ్రెస్ ఓటర్లను తిప్పుకుని బలపడాలని బీజేపీ చూస్తోంది. అందుకే గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన అమరీంద్ సింగ్ ను లాక్కుంది. కాంగ్రెస్ నేతలతో ఉన్న పరిచయాలతో ఆయన అక్కడ కాంగ్రెస్ ను వీక్ చేస్తారని బీజేపీ ఆశించినట్లు చెబుతున్నారు.

కాంగ్రెస్ ను దెబ్బకొట్టి ఆ పార్టీ బలాన్ని తమవైపుకు తిప్పుకోవాలని బీజేపీ స్కెచ్ వేసింది. అందుకే అమరీందర్ సింగ్ ను పావుగా వాడుకుంటోంది. కాంగ్రెస్ బలాన్ని తమవైపుకు తిప్పుకుంటే మరింత బలం పెరుగుతుందని, పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టవచ్చనేది బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది. అమరీందర్ సింగ్ కు కేంద్రంలో ఏదోక పదవి అప్పగించే అవకాశముంది. పంజాబ్ బీజేపీ బాధ్యతలను ఆయనకు అప్పగించే అవకాశముంది.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -