Modi-KCR: కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు గట్టి పోటీ పడుతున్నాయి. రాజకీయంగా ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు బీజేపీ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోండగా.. బీజేపీని తీవ్రంగా విమర్శిస్తూ సీఎం కేసీఆర్ మరోసారి అధికారాన్ని నిలుపుకుని హ్యాట్రిక్ విజయం సాధించేందుకు వ్యూహలు పన్నుతున్నారు. కానీ రాజకీయంగా పోటీ ఉండే పర్లేదు. పార్టీల మధ్య రాజకీయ పోరు ఎప్పుడు ఉంటుంది. కానీ ప్రజలకు నష్టం చేకూరేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పోటీ పడుతున్నారు. అవే అప్పులు. అప్పుల విషయంలో మోదీ, కేసీఆర్ మధ్య తారాస్ధాయిలో పోటీ నడుస్తోంది. కేంద్రం, రాష్ట్రం పెద్ద మొత్తంలో అప్పులు చేస్తూ ప్రజల నెత్తిపై భారం వేస్తున్నాయి.
చివరికి ఈ అప్పులను ప్రజలే తీర్చాల్సిన పరిస్ధితి రావొచ్చని, ప్రజలపై మరింత పన్నులు వేసి ప్రజల నుంచి వీటిని లాక్కునే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో మోదీ, తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చాక భారీగా అప్పులు చేశారు. రెట్టింపు స్థాయిలో సంక్షేమ పథకాలు, అభివృద్ది పనుల కోసం అప్పులు తీసుకున్నారు. ఈ అప్పులతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారు. పరిమితికి మంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. అప్పుల విషయంలో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. చివరికి ఈ అప్పుల భారం తమపైనే పడుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.
తలసారి అప్పుల భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచుతున్నాయి. మోదీ ప్రధానిగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు ఎనిమిది సంవత్సారల్లో ఏకంగా రూ.76.46 లక్షల కోట్ల అప్పులు చేశారు. మోదీ అధికారంలోకి రాకముందు గత 67 సంవత్సరాల్లో కేంద్రం చేసిన అప్పు రూ.62.42 లక్షల కోట్లుగా కాగా.. కేవలం 8 సంవత్సారల్లో దానికి మంచి రికార్డు స్థాయిలలో మోదీ అప్పుులు చేయడం గమనార్హం. దీంతో ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మొత్తం కలిపి రూ.138.88 లక్షల కోట్లు అప్పు చేసింది. జనాభా ప్రకారం లెక్క వేసుకుంటే దేశంలో ప్రతిఒిక్కరిపై రూ.1,14,695 భారం పడుతుంది.
ఇక కేసీఆర్ సీఎం అయిన తర్వాత గత 8 సంత్సరాల్లో రూజ2,39,533 కోట్ల అప్పు చేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అప్పుల వాట రూ.72,658 కోట్లు ఉంది. మొత్తం కలుపుకుంటే తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లుా ఉంది. జనాభా ప్రకారమే చూస్తే ఒక్కో మనిషిపై రూ.1,27,064 చొప్పున ఉంది. ఇక వచ్చే ఆర్దిక సంవత్సరం నాటికి మరిన్ని అప్పులు తీసుకునేందుకకు తెలంగాణ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ఇవన్నీ కలుపుకుంటే వచ్చే ఏడాది మార్చి నాటికి రూ.5 లక్షల కోట్లకు తెలంగాణ ప్రభుత్వఅప్పు చేరుకోనుంది. కేంద్ర, రాష్ట్ర అప్పుల లెక్క చూస్తే తెలంగాణలో ప్రతి మనిషిపై రెండున్న లక్షల చొప్పున భారం మోయాల్సి ఉంటుంది.
కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పు ఏకంగా ఆరు రెట్లు పెరిగింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు తలసరి అప్పు రూ.20,645 ఉండగా.. ఇప్పుడు రూ.1,27,064గా ఉంది. మోదీ ప్రభుత్వం ఏర్పడక ముందు రూ.44,095 ఉండగా.. ఇప్పుడు తలసరి అప్పు రూ.1,14,695కి చేరుకుంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అప్పుల విషయంపై తెలంగాణ ప్రబుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం అప్పులు ఎక్కువగా చేస్తుందని ఆరోపించారు. దీనికి కౌంటర్ గా ఇటీవల అసెంబ్లీలో అప్పుల వివరాలను రాష్ట్ర ఆర్దికశాఖ మంత్రి హరీశ్ రావు బయటపెట్టారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో పోటీ పడుతున్నాయనే విషయం లెక్కలతో సహా బయటపడింది. అభివృద్ధిలో పోటీ పడాలికానీ అప్పుల్లో మోదీ, కేసీఆర్ పోటీ పడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు.