Modi: కేంద్ర అందిస్తున్న రూ. 5 వేల ఆర్థికసాయం నిజమా?

Modi: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాల మేరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. అవి పొందాలంటే ఆన్‌లైన్‌ దరఖాస్తులను పూరించాల్సి ఉంటుంది. అయితే ఇదే అదనుగా భావించి కొందరు సైబర నేరగాళ్లు నకిలీ లింక్‌లు పంపించే డబ్బుల ఆశతో లూఠీ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్రం మరో పథకం ప్రవేశపెట్టిందని సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వర్గాల వారికి రకరకాల పథకాలను అమలు చేస్తోంది. దీంతో పాటు రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాలను ప్రవేశపెడుతోంది. ప్రభుత్వం తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఈ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూనే ఉంటుంది. తాజాగా అలాంటి ఓ ప్లాన్‌ గురించి సోషల్‌ మీడియాలో ఓ మెసేజ్‌ వైరల్‌ అవుతోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ శాఖ ప్రజలందరికీ రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తోందని ఈ వార్తా సారాంశం.

మోడీ ప్రభుత్వం పీఎం యోజన కింద కింద సామాన్యులకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేస్తోందనే ఓ సందేశం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ దీనిపై ప్రభుత్వ ఏజన్సీ అయిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ఈ విషయాన్ని వాస్తవాన్ని తనిఖీ చేసింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని దాని అధికారిక ట్విట్టర్‌ హ్యాండిల్‌తో పంచుకుంది. వెబ్‌సైట్‌లో చేసిన క్లెయిమ్‌ పూర్తిగా నకిలీదని పీఐబీ తేల్చి చెప్పింది.ప్రభుత్వం అటువంటి పథకాన్ని ప్రారంభించలేదు, దీని ద్వారా మీకు రూ. 5 వేల ఆర్థిక సహాయం అందుతుందనే వార్త పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది.

ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి లింక్‌లను క్లిక్‌ చేయడం వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉందని, సైబర్‌ నేరగాళ్లు ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను వైరస్‌ చేస్తూ ఆ లింక్‌లను క్లిక్‌ చేయడం వల్ల మీ వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంకు వివరాలు వారికి తెలిసిపోతాయని, దీంతో మీరు నష్టపోయే ప్రమాదం ఉందని పీఐబీ హెచ్చరించింది. ఏదైనా ప్రభుత్వ పథకం గురించి సమాచారాన్ని పొందడానికి ముందుగా మీరు దాని అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చని çసూచిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YCP-TDP: చంద్రబాబు అరెస్ట్ తో రగిలిపోతున్న టీడీపీ.. అరెస్ట్ పై వైసీపీ రియాక్షన్ ఏంటంటే?

YCP-TDP:  చంద్రబాబు నాయుడుని ఆధారాలు లేని కేసులో అరెస్టు చేసి జైల్లో పెట్టిన జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడుని జైల్లో పెట్టిన సందర్భంగా పండగ చేసుకుంటూ బాగా...
- Advertisement -
- Advertisement -