Modi: విశాఖలో ప్రధాని మోదీ పర్యటన వెనుక అసలు వ్యూహం ఇదేనా?

Modi: ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ, బీజేపీ జెండాలతో పాటు మోదీకి స్వాగతం పలుకుతూ పార్టీలన్నీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు విశాఖ తీరంలో దర్శనమిస్తోన్నాయి. నగరంలో ఎక్కడ చేసిన పార్టీల ఫ్లెక్సీలే కనిపిస్తోన్నాయి. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, వామపక్షాలు చేస్తోన్న ఆందోళనలతో విశాఖ అట్టుడుకుతుంది. వామపక్షాలకు కాంగ్రెస్ కూడా తోడైంది.

మోదీ పర్యటన సమయంలో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేయకుండా ముందస్తు అరెస్ట్ లు కూడా చేస్తోన్నారు. మోదీ పర్యటన ముగిసే వరకు ఎలాంటి ఆందోళనలు చేయవద్దని, చేస్తే అరెస్ట్ లు చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తోన్నారు. చెన్నై పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి మోదీ విశాఖకు చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలికారు. అలాగే పలువురు బీజేపీ నేతలు కూడా మోదీకి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా విశాఖలోని మారుతి జంక్షన్‌లో మోదీ ఒకటిన్నర కిలోమీటర్ల పాటు రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఐఎన్‌ఎస్ డేగకు మోదీ చేరుకున్నారు. ఐఎన్ఎస్ చోళకు వెళ్లి మోదీని పవన్ కలిశారు. ఆ తర్వాత సీఎం జగన్ కూడా మోదీని కలిశారు ఇవాళ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నూతన భవన సముదాయాలకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అయితే మోదీ పర్యటను సక్సెస్ చేసేందుకు వైసీపీ, బీజేపీ పోటీ పడుతోన్నాయి. వైసీపీ తన క్రెడిట్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. నగరమంతా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఈ పార్టీలకు పోటీగా బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.అయితే అన్ని పార్టీలను మచ్చిక చేసుకుని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పకుండా చేయడమే బీజేపీ వ్యూహంగా తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

YCP Schemes: వైసీపీ ప‌థ‌కాల‌ను కాపీ కొట్టి పులిహోర క‌లిపేశారు.. చంద్రబాబుకు జగన్ షాక్!

YCP Schemes: ఏపీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సందర్భంగా ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్ జోరుని పెంచేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాలపై విమర్శలు...
- Advertisement -
- Advertisement -