PM Modi-CM KCR: తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. సీఎం కేసీఆర్ ఏం చేస్తారో?

PM Modi-CM KCR: ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. ఒకేసారి ఏపీతో పాటు తెలంగాణకు కూడా వస్తున్నారు. మోదీ వస్తున్నది ఎన్నికల ప్రచారానికో లేదా రాజకీయ సమావేశానికో అనుకుంటే పొరపాటే.. అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున తెలుగు రాష్ట్రాల్లోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుప్ధాపన చేయనున్నారు. రెండు రోజుల తెలుగు రాష్ట్రాల్లో మోదీ పర్యటించనున్నారు. ప్రధాని వస్తుండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటినుంచే సీఎస్‌లు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తోన్నారు.

నవంబర్ 11న మోదీ ఏపీ పర్యటనకు రానుండగా.. తర్వాతి రోజు 12న తెలంగాణలో పర్యటించనున్నారు. ఏపీలో విశాఖకు మోదీ వస్తున్నారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత విశాఖ సిటీలో జరిగే బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నారు. విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో మోదీ బహిరంగ సభకు అధికారులు ఏర్పాట్లు చేస్తోన్నారు. ఈ పర్యటనలో ఏపీ ప్రభుత్వం నిర్మిస్తోన్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు కూడా మోదీ శంకుస్థాపన చేసే అవకాశముంది. విశాఖ వేదికగా మూడు రాజధానుల ఉద్యమాన్ని వైపీపీ సర్కార్ తెరపైకి తీసుకుని రావడం, మూడు రాజధానులుగా మద్దతుగా ఉత్తరాంధ్ర మంత్రులు, వైసీపీ మంత్రులు మాట్లాడుతున్న తరుణంలో మోదీ విశాఖకు రానుండటం చర్చనీయాంశంగా మారింది.

బహిరంగ సభలో మూడు రాజధానులపై మోదీ స్పందిస్తారా..? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అమరావతికే తాము కట్టుబడి ఉన్నామంటూ రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రులు చెబుతున్నారు. అయితే మూడు రాజధానులకు మద్దతుగా రాయలసీమలో కూడా వైసీపీ ఉద్యమం స్టార్ట్ చేసింది. భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో సభ నిర్వహించింది. త్వరలో విజయవాడలో కూడా సభ నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ సర్కార్ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ వేడి పుట్టిస్తోన్న క్రమంలో దీనిపై మోదీ స్పందిస్తారా.. లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఇక తెలంగాణలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేసేందుకు మోదీ 12వ తేదీ రామగుండం రానునన్నారు. 2016 ఆగస్టు 7న దీని పునరుద్దరణ పనులు ప్రారంభించగా… ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్పత్తి ప్రారంభమైంది. ప్రధాని పర్యటనలో ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర సీఎం, గవర్నర్ పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా.. లేదా.. అనేది చర్చనీయాంశంగా మారింది. గతంలో రెండుసార్లు మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో కేసీఆర్ స్వాగతం పలకలేదు. కేసీఆర్ తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో రాష్ట్రంలో సంచలనం రేపుతోన్న క్రమంలో మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనే అవకాశం లేదు.

మళ్లీ మోదీకి తలసాని శ్రీనివాస్ యాదవ్‌నే స్వాగతం పలికే అవకాశముంది. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య రాజకీయ యుద్దం జరుగుతోంది. పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. మరో ఏడాది మాత్రమే ఎన్నికలకు సమయం ఉండటంతో ఇది తారాస్ధాయికి చేరుకునే అవకాశముంది. ఇలాంటి నేపథ్యంలో మోదీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.

Related Articles

ట్రేండింగ్

Big Shock to Vanga Geetha: వైసీపీ అభ్యర్థి వంగా గీతకు వరుస షాకులు.. సమస్యలు పరిష్కరించకుండా ఓట్లు అడుగుతారా?

Big Shock to Vanga Geetha: మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీ మొత్తం ఒకవైపు అయితే...
- Advertisement -
- Advertisement -