Narendra Modi: పని చేయని మోదీ మ్యాజిక్ అయ్యో ఇంత ఘోర ఓటమా?

Narendra Modi: కర్ణాటకలో కనివినీ ఎరుగని రీతిలో బీజేపీ ప్రచార పర్వం సాగిన విషయం తెలిసిందే. దాదాపు నెల రోజులపాటు నరేంద్ర మోడీ ర్యాలీలు ఎన్నికల సభలు రోడ్డు షోలు నిర్వహించారు. ఎన్నిక‌ల ప్ర‌చారం ముగుస్తున్న ద‌శ‌లో మోడీ చేప‌ట్టిన ఏకంగా పాతిక కిలోమీట‌ర్ల పై ర్యాలీ ఈ ప్ర‌చారంలో ప‌రాకాష్ట‌ అని చెప్పవచ్చు. అయితే ఇంత చేసిన కూడా క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప‌రువైతే నిల‌వ‌డం లేదు. బీజేపీ క‌నీసం 80 సీట్ల‌లో విజ‌యం సాధించ‌డం గ‌గ‌నంలా ఉంది ప‌రిస్థితి. అన్నింటికీ మించీ బీజేపీకి మెజారిటీ ద‌క్క‌క‌పోతే క‌నీసం హంగ్ అయినా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్ట‌మైన మెజారిటీ దిశ‌గా ప‌య‌నిస్తోంది.

కాగా మ‌రి మోడీ, అమిత్ షాల మంత్రాంగం ఫ‌లించ‌లేదు. మోడీ 26 ర్యాలీలు, స‌భ‌లు, రోడ్ షోల్లో అమిత్ షా ఏకంగా 31 ఎన్నిక‌ల ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో స్వ‌యంగా పాల్గొన్నారు. మోడీ అనే మాట తప్ప కర్ణాటకలో మరో మాట వినిపించలేదు. మరి ఇంత చేసినా కూడా బిజెపికి ఓటమి మిగులుతోంది. కాగా కర్ణాటక ఎన్నికల ఫలితాలతో మోడీ మ్యాజిక్ ద‌క్షిణాది పూర్తిగా ప్ర‌శ్నార్థ‌కం అవుతోంది. సౌత్ లో బీజేపీకి ఆశ‌లేవైనా ఉంటే అది క‌ర్ణాట‌క‌లోనే. ఇప్పుడు స్వ‌యంగా మోడీనే ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని పోరాడిన చోట ఉన్న అధికారాన్ని కూడా బీజేపీ నిల‌బెట్టుకోలేక‌పోతోంది.

 

అయితే మోడీ అంత చేసినా కూడా చివరికి పోషించిన ఫలితం దక్కడంతో పాపం మోడీ అంటూ కష్టమంతా వృధా అయ్యింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ కర్ణాటకలో విజ‌యం కోసం మోడీ అన్ని అస్త్రాల‌నూ సంధించారు. టీ కొట్టు స్థాయి రాజ‌కీయ ప్ర‌క‌ట‌న‌లు కూడా చేశారు. ఆఖ‌రికి అదేదో ది కేర‌ళ స్టోరీ అనే సినిమాను కూడా వాడుకున్నారు. అయితే ఇవేవీ ప‌నికి రాలేదు. ముస్లింలో వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు రిజ‌ర్వేష‌న్ల ర‌ద్దు, హిజాబ్ వివాదం ఇలాంటివి కూడా బీజేపీ మెజారిటీని ఇవ్వ‌లేకపోయాయి.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -