Lireesha: మోహన్ బాబు నన్ను అలా తోసేశారు.. కిందపడ్డా: నటి లిరీష

Lireesha: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సునామీ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో కోర్టు సీన్లు చాలా ఉండగా.. ఒక సీన్ లో వచ్చే డైలాగులు అందరినీ బాగా ఆకట్టుకున్నాయి. లేడీ పోలీస్ అధికారి ఒకావిడ.. ఘటనా స్థలానికి వచ్చిన తీరును వివరించే క్రమంలో లాయర్ గా పవన్ కళ్యాణ్ చెప్పే డైలాగులు, సెటైర్లు ఎంతో బాగా పండాయి.

 

లేడీ పోలీస్ అధికారిగా నటించిన నటి లిరీషను ఉద్దేశించి పవన్.. ‘సూపర్ ఉమెన్’ అంటూ సంభోదించడం సినిమాలో హైలెట్ గా నిలచింది. ఈ సీన్ లో థియేటర్లో జనాలు బాగా ఎంజాయ్ చేయగా.. ఈ ఒక్క సీన్ తో లిరీషకు మంచి గుర్తింపు వచ్చింది. నిజానికి లిరీష చాలా తెలుగు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. వకీల్ సాబ్ సినిమాలో మరీ ప్రత్యేకంగా ఆ ఒక్క సీన్ తో వచ్చింది. కాగా లిరీష తెలుగు ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపున్న మోహన్ బాబు గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

తాను సినిమా ఇండస్ట్రీలోకి ‘పొలిటికల్ రౌడీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినట్లు లిరీష తెలిపింది. కమెడియన్ అలీ వల్ల తనకు ఆ సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. అందులో తాను హీరోయిన్ చార్మి ఫ్రెండ్ క్యారెక్టర్ వేసినట్లు లిరీష తెలిపింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ ఘటన గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఓ సీన్ కోసం తాను కింద పడాల్సి ఉందని.. కానీ ఎంతకీ కిందపడలేదని లిరీష తెలిపింది.

దాంతో మోహన్ బాబు హఠాత్తుగా వచ్చి.. తనను కావాలని తోసేసినట్లు నటి లిరీష వివరించింది. దీంతో వెంటనే కింద పడిపోయినట్లు పేర్కొంది. ఆ సీన్ షూట్ కంప్లీట్ అయిందని తెలిపింది. అయితే ఆ దెబ్బతో తర్వాత రోజు షూటింగ్ కి ఉదయం గం.5.30కే వచ్చానని లిరీష గతాన్ని గుర్తు చేసుకుంది. మోహన్ బాబు వల్ల తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నట్లు లిరీష వివరించింది.

కాగా వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు సాధించిన లిరీష.. ఆసినిమా తర్వాత తన రెమ్యునరేషన్ ని భారీగా పెంచినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా.. అప్పుడప్పుడు బుల్లితెర మీద కూడా లిరీష సందడి చేస్తోంది. టీవీలో వచ్చే సీరియల్స్ లో అతిగా చేయాల్సి ఉంటుందని.. కానీ సినిమాలో నేచురల్ గా చేయాల్సి ఉంటుందని ఆమె వివరించింది.

 

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -