Godfather: గాడ్ ఫాదర్ విజయం వెనుక మోహన్ రాజా మార్పులే కారణమా?

Godfather: మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం గాడ్ ఫాదర్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా లూసిఫర్ సినిమా రీమేక్ చిత్రం అనే విషయం మనకు తెలిసిందే. అయితే లూసిఫర్ సినిమాతో పోలిస్తే గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంది. ఈ విధంగా ఈ సినిమా ఒరిజినల్ సినిమాకు మించి ఆదరణ సంపాదించుకోవడానికి గల కారణాలు ఇవే అని చెప్పాలి.

లూసిఫర్ సినిమా చూసిన అనంతరం మోహన్ రాజా ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలని భావించారు. ఈ క్రమంలోని తాను చేసిన మార్పులకు అనుగుణంగా ఈ సినిమాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుందని చెప్పాలి. ఇక ఈ సినిమాలో ఎలాంటి మార్పులు చేశారనే విషయాన్ని వస్తే…

ఒరిజినల్ లూసిఫర్ సినిమాలో మోహన్ లాల్ కు ఒక తమ్ముడు ఉంటారు. ఆయన పృధ్విరాజ్ పొలిటికల్ డ్రామా నడిపించారు.ఇక మోహన్ లాల్ తమ్ముడు పెద్ద ఎత్తున రాజకీయ సభలు ఏర్పాటు చేయడం,స్పీచ్ లు ఇవ్వడం చాలా పెద్దతంగం ఉంది అయితే మోహన్ రాజా తన తమ్ముడి పాత్రను లేపేసి హీరో చెల్లెలు పాత్రను తీసుకువచ్చారు. ఈ పాత్రలో నయనతారకు అత్యధికంగా ఇంపార్టెంట్ ఇవ్వడం చాలా హైలెట్ గా నిలిచింది.

ఇక ఒరిజినల్ లూసిఫర్ సినిమా రెండు గంటల 45 నిమిషాల రన్ టైమ్ ఉంది అయితే ఇంత నిడివి ఉంటే తప్పకుండా ప్రేక్షకులకు బోర్ కొడుతుంది అందుకే ఈ సినిమా తెలుగు వెర్షన్ నిడివి పూర్తిగా తగ్గించారు. ఇక లూసిఫర్ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ పాత్ర చివరిలో వస్తుంది కానీ తెలుగులో మాత్రం సల్మాన్ ఖాన్ పాత్ర పై నిడివి పెంచి రెండు మూడు సన్నివేశాలలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ విధంగా లూసిఫర్ సినిమాకి గాడ్ ఫాదర్ సినిమాకి మధ్య ఇలాంటి మార్పులు చేయడంతో ఈ సినిమా ఎంతో మంచి విజయం అందుకుందని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -