Mokshagna: నందమూరి ఫ్యాన్స్ కు ఇంతకంటే శుభవార్త ఉంటుందా?

Mokshagna: బాలకృష్ణ సంగీతం శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన ఆదిత్య 369 మూవీ అప్పట్లో సంచలన విజయాన్ని సంపాదించండి. టైం మెషిన్ కాన్సెప్ట్ ఒక మోడ్రన్ యువకుడి క్యారెక్టర్ లో మరియు తెలుగు జాతికి గర్వకారణమైన శ్రీకృష్ణదేవరాయల క్యారెక్టర్ లో బాలకృష్ణ నటనకు జనాలు జోహార్లు చెప్పారు. అప్పటినుంచి ఆ సినిమాకి సీక్వెల్ చేయాలి అన్న బాలకృష్ణ కోరిక తీరని కలగా అలాగే మిగిలి పోయింది.

 

ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో టైం మిషన్ కాన్సెప్ట్ వచ్చినప్పటికీ ఇంకా ఆదిత్య 369 క్రేజ్ మాత్రం జనాలలో ఇప్పటివరకు తగ్గలేదు. తానే స్వయంగా దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని తిరిగి తీయాలన్నా తన కోరికను బాలయ్య ఎన్నో సందర్భాలలో వెల్లడించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కీలక పాత్రలో మోక్షజ్ఞ నటిస్తాడు అని ప్రచారం జరుగుతుంది.

 

బాలకృష్ణ ఈ సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హల్చల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తికాకముందే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఇంకో సినిమాకి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆదిత్య 369 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైనట్లు సినీ వర్గాలలో టాక్.

 

చాలా రోజుల నుంచి ఈ సీక్వెల్ గురించి ఎన్నో పుకార్లు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిలో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం పై ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు. అయితే ఈ ఫిబ్రవరిలో ఆదిత్య త్రి 99 సినిమా యొక్క పూజా కార్యక్రమాలు జరగబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ నందమూరి అభిమానుల్లో మాత్రం ఆనందం వెళ్లి విరుస్తోంది. సోషల్ మీడియాలో ఆదిత్య 369 గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తమ సంబరాన్ని చాటుకుంటున్నారు. బాలకృష్ణతో కలిసి మోక్షజ్ఞ ఈ చిత్రంలో నటిస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక. మరి ఈ సినిమా గురించి అధికారికమైన ప్రకటన వినపడుతుందా లేదా అనేది మనకు 2023 ఫిబ్రవరిలో తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -