Mokshagna: నందమూరి బాలయ్య ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్ ఇదే!

Mokshagna: నందమూరి అభిమానులకు అదరిపోయే శుభవార్త. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీపై రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అద్భుతమైన ప్రాజెక్ట్‌ తో మోక్షజ్ఞ తేజను హీరోగా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చాలా సందర్భాల్లో మోక్షజ్ఞ తేజ మీడియా కంట పడుతూనే ఉన్నారు. తాజాగా నందమూరి నటసింహం బాలయ్యతో కలిసి హిట్-2 సినిమా చూశాడు. అప్పుడు తండ్రి బాలయ్యతో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ తేజకు సంబంధించిన ఓ ఫోటో సెన్సెషనల్ అవుతోంది. తన బరువును తగ్గించుకుని హీరోలా ఫిజిక్ తెచ్చుకోవడానికి మోక్షజ్ఞ తేజ ఆయుర్వేద ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీని కోసం హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి పక్కనే ఉన్న ‘యాడ్ లైఫ్’ అనే ఆయుర్వేదిక్ ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నాడని సమాచారం.

 

 

యాడ్ లైఫ్ ఆయుర్వేదిక్ సెంటర్‌లో ఆయుర్వేద పంచకర్మ వంటి ట్రీట్‌మెంట్ చేస్తారు. ఏరోబిక్స్, యోగ, జిమ్, నాచురోపతి, ఆయుర్వేదం తదితర ట్రీట్‌మెంట్‌లు అందిస్తారు. అయితే ఈ సెంటర్ నుంచి మోక్షజ్ఞ తేజ బయటికి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మోక్షజ్ఞ తేజ ఫోటోలు చూసిన నందమూరి ఫ్యాన్స్ వేట మొదలైందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మోక్షజ్ఞ తేజను ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌లోనే లాంఛ్ చేయాలని బాలయ్య భావిస్తున్నారు. ఈ సినిమా స్టోరీ, డైరెక్షన్ కూడా బాలయ్యే చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘ఆదిత్య 999 మ్యాక్స్’ పేరును కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం బాలయ్య గోలిచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnam Raju: రఘురామ కృష్ణంరాజు కల నెరవేరిందిగా.. ఉండి ఎమ్మెల్యేగా ఆయన విజయం పక్కా!

Raghurama Krishnam Raju: ప్రస్తుత నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలుపొందారు. ఇలా గెలిచిన కొద్ది రోజులకే పార్టీ పిఠాయించి తెలుగుదేశం చెంతకు చేరారు....
- Advertisement -
- Advertisement -