Money: నెలాఖరులోపు పర్స్ ఖాళీ అవుతోందా.. ఇలా చేస్తే చాలు?

Money: మన చుట్టూ ఉన్న వారిలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధాన సమస్య ఆర్థిక ఇబ్బందులు. కష్టపడి సంపాదించినప్పటికీ డబ్బు చేతులు మిగలడం లేదని, పైగా అప్పుల పాలు అవుతున్నాము అంటూ చాలామంది దిగులు చెందుతూ ఉంటారు. ఇంత కష్టపడి సంపాదించినప్పటికీ మళ్లీ నెల ఆఖరు వచ్చే లోపల చేతిలో డబ్బులు మిగలడం లేదని అనుకుంటూ ఉంటారు. అయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కాలి అంటే ప్రధానంగా మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి. లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటే ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండవచ్చు.

 

అయితే మనం చేసే కొన్ని రకాల వాస్తు విషయాల వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. దాంతో లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోవడం మనపై కోపం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. డబ్బులు చేతిలో మిగిలాలి లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అంటే ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే సాధారణంగా జాతకంలో కొన్ని కారణాల వల్ల బుధ గ్రహం స్థానం బలహీనంగా ఉంటే అటువంటి వ్యక్తి దగ్గర డబ్బు ఎక్కువ కాలం నిలబడదు. అతను కోరుకున్నప్పటికీ అతను ఆదా చేయలేడు. అలాగే మన ఇంట్లోనే వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.

 

అన్నం అలాగే అన్నపూర్ణ సంతోషించి లక్ష్మీ రూపంలో ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆర్థిక ఇబ్బందులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉండవు. ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవడంతో పాటు సంపాదించిన డబ్బులు ఉండడం మాత్రమే కాకుండా నెల ఆఖరిలో కూడా మీకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే మనం డబ్బును ఎక్కడపడితే అక్కడ ఉంచకూడదు. ఇంట్లో డబ్బును దాచుకోవడం కోసం సురక్షితమైన స్థలం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. డబ్బును దాచిపెట్టడానికి ఎల్లప్పుడూ ఉత్తరం లేదా తూర్పు దిశను సురక్షితంగా భావించాలి. ఈ విధంగా చేయడం వల్ల డబ్బులు మిగలడంతో పాటు నాకు రావాల్సిన డబ్బు కూడా చేతికి అందుతుంది. అలాగే ఎప్పుడూ ఇలా మనం మన దగ్గర ఉన్నప్పుడు మనకు ఉన్నంతలో నిరుపేదలకు దాన రూపంలో వస్తు రూపంలో ఏదో ఒక విధంగా దానం చేయాలి. నిరుపేదలకు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. మనం బయటికి వెళ్లినప్పుడు మన పర్సులో కొంత భాగాన్ని నిరుపేదలకు విరాళంగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. పుణ్యం లభించడంతోపాటుగా ఇంట్లో నిరంతరం డబ్బు ప్రవాహం కొనసాగుతుంది..

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -