తెలుగు ప్రేక్షకులకు 1993లో విడుదలైన మాతృదేవోభవ సినిమా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఈ సినిమాకు కే అజయ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో రాలిపోయే పువ్వా పాటకు ప్రేక్షకులు భారీ స్థాయిలో ఫిదా అయ్యారు. అసలు ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ అయిన సిబి మలైల్ రూపొందించిన ఆకాశదూతు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో హైదరాబాదుకు 40 కిలోమీటర్ల దూరంలో ఒక ఇంటి సెట్ వేసి షూటింగ్ చేయడం ప్రారంభించారు. అప్పట్లోనే దాదాపు 37 లక్షల రూపాయల ఖర్చుతో సినిమాను మొత్తం సిద్ధం చేశారు. ఇక 1993 అక్టోబర్ 22న సినిమా విడుదల చేశారు. సినిమాకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారు అనుకున్న సమయంలో సినీ బృందం తీరని స్థాయిలో ఆశ్చర్యానికి గురైంది.
కేవలం 25 టికెట్లు తప్ప మరో టికెట్ అమ్ముడు పోలేదని చెప్పవచ్చు. దీంతో సినీ బృందం మొత్తం చేతులెత్తేసి ఢీలా పడిపోయారు. అప్పట్లో మొత్తం రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఎదురైంది. చూసినవాళ్లంతా బాగానే ఉంది అంటున్నారు. కానీ చూసేవారే కరువయ్యారు. వారం గడిచిన తర్వాత థియేటర్ యాజమానులకు ఫలితం అర్థమైంది. ఈ సినిమా పూర్తిగా ప్లాప్ అని గ్రహించుకున్నారు. ఆ సమయంలో కే ఎస్ రామారావు గారికి ఫోన్ చేశారు.
రామారావు మాత్రం సినిమా విషయంలో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఏం పర్లేదు ఇంకో రెండు వారాలు చూద్దాం. మీ నష్టానికి అంతా నేను పూచి అని ధైర్యం చెప్పాడట. అంతేకాకుండా ఇకనుంచి ప్రతి థియేటర్లో టికెట్ తో పాటు ఒక కర్చీఫ్ కూడా ఫ్రీగా ఇవ్వమని చెప్పారట. టికెట్ తో పాటు కర్చీఫ్ ఏమిటని? ఆశ్చర్యపోయారట. ఈ విషయంలో ప్రేక్షకులు కూడా కొంచెం ఆశ్చర్యపోయారు. కానీ థియేటర్ లోపలికి వెళ్తే గాని తెలియలేదు. సినిమా ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. ఎంతలా అంటే ప్రేక్షకుడి హృదయానికి గాయమయ్యే విధంగా అనిపించింది. సినిమా పాజిటివ్ టాక్ అందుకొని భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంది.